అధిక బరువు సమస్యతో సతమతం అవుతున్నారా.? వెయిట్ లాస్ అయ్యేందుకు కఠినమైన డైట్ ను ఫాలో అవుతున్నారా.? నిత్యం వర్కౌట్ చేస్తూ చెమటలు చిందిస్తున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే పొడి అద్భుతంగా సహాయపడుతుంది.రోజు వర్కౌట్ చేసిన తర్వాత ఈ పొడిని రోజుకు ఒక స్పూన్ చొప్పున తీసుకుంటే మరింత వేగంగా బరువు తగ్గుతారు.అదే సమయంలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక కప్పు బాదం( almonds ), అర కప్పు జీడిపప్పు( cashew nut ), అర కప్పు వాల్ నట్స్, అర కప్పు పిస్తా పప్పు( pistachio nut ), అర కప్పు ఓట్స్, అర కప్పు ఫూల్ మఖానా తీసుకుని వేటికవి వేయించి ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి.
ఈ పదార్థాలన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ లో ఒక కప్పు బెల్లం తురుము( Grate jaggery ), అర కప్పు మిల్క్ పౌడర్, ఐదు టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.వర్కౌట్ తర్వాత విపరీతమైన ఆకలి వేసేస్తుంటుంది.ఆ సమయం లో ఏదో ఒకటి లాగించేస్తుంటారు.దీంతో వర్కౌట్ చేసిన ఫలితం దక్కదు.అయితే వర్కౌట్ చేసిన తర్వాత పైన చెప్పిన పొడిని వన్ టేబుల్ స్పూన్ చొప్పున ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకోవాలి.

ఇలా చేస్తే బాడీ రీబూస్ట్ అవుతుంది.ఫుల్ ఎనర్జిటిక్ గా మారతారు.ఆకలి నీరసం వంటివి పరార్ అవుతాయి.
అదే సమయంలో మెటబాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.ఫలితంగా మీరు మరింత వేగంగా వెయిట్ లాస్ అవుతారు.
అలాగే ఈ పొడిని రెగ్యులర్ గా తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు వేధించకుండా ఉంటాయి.మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
మరియు హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది.