విజయ్ వర్మతో రిలేషన్ పై ఓపెన్ అయిన తమన్నా.. మా బంధం నిజమేనంటూ?

స్టార్ హీరోయిన్ తమన్నా( Tamannah ) విజయ్ వర్మతో( Vijay Varma ) రిలేషన్ లో ఉందని గత కొన్ని నెలలుగా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.ఈ వార్తలు రోజురోజుకు ఎక్కువ అవుతుండటంతో హీరోయిన్ తమన్నా విజయ్ వర్మతో రిలేషన్ షిప్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Tamannah Comments About Relationship With Vijay Varma Details, Tamannah , Vijay-TeluguStop.com

విజయ్ వర్మతో ఉంటే సంతోషంగా ఉంటానని ఆమె పేర్కొన్నారు.అతడితో రిలేషన్ నిజమేనని తమన్నా చెప్పుకొచ్చారు.

విజయ్ వర్మ నా సహనటుడని నేను అతనితో చనువుగా ఉండటానికి కారణం ఇది మాత్రమే కాదని తమన్నా అన్నారు.నాకు, విజయ్ వర్మకు మధ్య మంచి బంధం ఉందని అమె తెలిపారు.

ఎవరినైనా లవ్ చేయాలంటే వాళ్లతో సంతోషంగా ఉన్నామనే భావన కలగాలని విజయ్ తో నాకు ఆ భావన కలిగిందని తమన్నా వెల్లడించారు.విజయ్ కష్టం వస్తే నాతో ఉంటాడని నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడని ఆమె తెలిపారు.

Telugu Bhola Shankar, Tamannah, Tamannahvijay, Vijay Varma-Movie

సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతున్నామంటే కిందికి లాగాలని చాలామంది ప్రయత్నిస్తారని తమన్నా కామెంట్లు చేశారు.నాకోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నానని ఆమె అన్నారు.అందులో నన్ను నన్నుగా అర్థం చేసుకునే విజయ్ వర్మ వచ్చాడని తమన్నా వెల్లడించారు.విజయ్ వర్మకు నాకు మధ్య ఆర్గానిక్ బంధం ఉందని తమన్నా పేర్కొన్నారు.

Telugu Bhola Shankar, Tamannah, Tamannahvijay, Vijay Varma-Movie

తమన్నా చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే విజయ్ వర్మతో రిలేషన్ ను అంగీకరించినా పెళ్లికి( Tamannah Marriage ) సంబంధించి మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వడం లేదు.తమన్నా పప్పన్నం పెట్టే రోజు త్వరలోనే ఉందని పెళ్లికి సంబంధించిన శుభవార్తను ఆమె త్వరలోనే చెబుతారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.తమన్నా ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.

తమన్నా సక్సెస్ రేట్ తక్కువే అయినా తెలుగులో ఆమెకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube