పొడవాటి జుట్టు కావాలని కోరుకోని ఆడవారు ఉండరు.ఎందుకంటే, అందాన్ని రెట్టింపు చేయడంలో పొడవాటి జుట్టు అద్భుతంగా సహాయపడుతుంది.
అందుకే జుట్టును పొడుగ్గా పెంచుకోవడం కోసం ఖరీదైన నూనెలు, షాంపూలు వాడుతుంటారు.అలాగే జుట్టుపై ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు.
కానీ, ఎన్ని చేసినా కొందరిలో హెయిర్ గ్రోత్ సరిగ్గా ఉండదు.దాంతో ఏం చేయాలో తెలియక ముందులు సైతం వాడుతుంటారు.
కానీ, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే కేవలం రెండంటే రెండు పదార్థాలతో పొడవాటి జుట్టు తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెండు పదార్థాలు ఏంటీ.? వాటిని ఎలా జుట్టుకు వినియోగించాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల బ్రౌన్ రైజ్, రెండు బ్లాక్ టీ బ్యాగులు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించాలి.
ఆ తర్వాత స్టైనర్ సాయంతో వాటర్‌ను మాత్రం ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్‌ను ఒక బాటిల్‌లో నింపి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు స్ప్రే చేసుకుని షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా నాలుగు రోజులకు ఒక సారి చేస్తే గనుక.జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.హెయిర్ ఫాల్, హెయిర్ బ్రేకేజ్, స్ప్లిట్ ఎండ్స్ వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తాయి.అలాగే కొందరికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది.దాంతో ఆ వైట్ హెయిర్‌ను కవర్ చేసుకోవడం కోసం కలర్స్‌పై ఆధారపడుతుంటారు.
కానీ, పైన చెప్పిన రెమెడీని ఫాలో అయితే తెల్ల జుట్టు సహజంగానే నల్లగా, షైనీగా మారుతుంది.