ఉల్లితో ఇలా చేస్తే.. జుట్టు ఊడ‌మ‌న్నా ఊడ‌దు!!

ఇటీవ‌ల కాలంలో ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు.జుట్టు రాల‌డానికి ప్ర‌ధాన క‌ర‌ణాలు.

 How To Use Onions For Hair Growth??, Onions For Hair Growth, Hair Fall, Hair Car-TeluguStop.com

హార్మోన్ల అసమతుల్యత, పోష‌కాహార‌లోపం, థైరాయిడ్‌, ఒత్తిడి, మారిన జీవన విధానం, కాలుష్యం ఇలా చాలా కార‌ణాలే ఉన్నాయి.ఇక ఈ స‌మ‌స్య‌ను అదుపు చేసేందుకు ఎన్ని చిట్కాలు పాటించినా.

ప్రయోజనం లేక తెగ బాధ‌ప‌డుతుంటారు.అయితే జుట్టు రాలడాన్ని అరికట్టడంలో ఉల్లిపాయ అద్భుతంగా స‌హాప‌డుతుంది.

ఉల్లిపాయలో ఉండే పోషక విలువలు జుట్టును దృఢంగా ఎదిగేలా చేస్తాయి.

మ‌రి ఉల్లిని జుట్టుకు ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఉల్లిపాయ ముక్కలను మెత్తగా రుబ్బి రసాన్ని తీసుకోవాలి.ఆ ర‌సాన్ని తలకు, కేశాలకు బాగా ప‌ట్టించి.

అర‌గంట పాటు ఆర‌నివ్వాలి.అనంత‌రం గోరువెచ్చిన నీటితో త‌ల‌స్నానం చేయాలి.

ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల‌.ఖ‌చ్చితంగా జుట్టు రాలే స‌మ‌స్య త‌గ్గుతుంది.

ఉల్లిపాయ ముక్కలను మెత్తగా రుబ్బి రసాన్ని తీసుకోవాలి.ఆ ర‌సంలో కొద్దిగా కొబ్బ‌రి నూనె మిక్స్ చేసి త‌ల‌కు బాగా ప‌ట్టించారు.అరగంట త‌ర్వాత జుట్టును క్లీన్ చేసుకోవాలి.ఉల్లిగ‌డ్డ‌లో బ్యాక్టీరియా, ఫంగస్‌లను తరిమికొట్టే గుణాలతో పాటు మంచి పోష‌కాలు కూడా చాలా ఉన్నాయి.

ఇవి జుట్టు కుదుళ్లను ఒత్తుగా, బలంగా అయ్యేలా చేస్తాయి.చుండ్రు స‌మ‌స్య‌ను కూడా నివారిస్తాయి.

అలాగే ఉల్లిపాయ ముక్కలను మెత్తగా రుబ్బి రసాన్ని తీసుకోవాలి.ఆ ర‌సంలో కొద్దిగా నిమ్మ‌ర‌సం మిక్స్ చేసి.తలకు, కేశాలకు బాగా ప‌ట్టించాలి.అర‌గంట పాటు ఆర‌నిచ్చి.

అనంత‌రం గోరువెచ్చిన నీటితో త‌ల‌స్నానం చేయాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల జుట్టు రాలే స‌మ‌స్య త‌గ్గ‌డంతో పాటు జుట్టు పెరుగుదల కూడా బాగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube