ఈ మధ్యకాలంలో చాలామంది వయసు తేడా లేకుండా డయాబెటిస్ తో ( Diabetes ) బాధపడుతున్నారు.అయితే అలాంటి వారికి ఈ పండ్లను తింటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
నోరూరించే రుచికరమైన నేరేడు పండ్లు( Black Jamun ) చాలా ఆరోగ్యకరమైనవి.అయితే నేరేడు పండులో ప్రోటీన్లు, ఫైబర్, ఆంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ సి,B6 పుష్కలంగా ఉంటాయి.
ఇది హిమోగ్లోబిన్ పెంచడానికి కూడా సహాయపడుతుంది.అలాగే రోగనిరోధక శక్తిని ( Immunity Power ) కూడా మెరుగుపరుస్తుంది.
అంతేకాకుండా జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసే లక్షణాలు కూడా ఇది కలిగి ఉంటుంది.ఈ పండు డయాబెటిస్ రోగులకు చాలా మంచిది.

ప్రతిరోజు జామున్ తీసుకోవడం వలన ఇన్సులిన్ చర్యను మెరుగుపరుస్తుంది.మధుమేహం రాకుండా నిలువరించడంలో కూడా ఈ పండ్లు చాలా సహాయపడతాయి.నేరేడులో జంబోలిన్ అనే సమ్మేళనం ఉంది.అయితే ఇది రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది.అయితే ఈ పండుతో పాటు విత్తనాలు, ఆకులు, బెరడు నుండి సేకరించిన పదార్థాలు శరీరంలోని అధిక రక్త స్థాయి తగ్గించడంలో సహాయపడతాయి.నేరేడు పండ్లు వేసవికాలంలో లభిస్తుండడంతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందజేస్తుంది.

అంతేకాకుండా నేరేడు పండును ఎన్నో విధాలుగా తినవచ్చు.వీటిని పచ్చిగా తినవచ్చు లేదా రసాన్ని తయారు చేసుకుని తాగవచ్చు.అలాగే సలాడ్లు, స్మూతీలు జామ్ మొదలైన వాటిలో ఉపయోగించవచ్చు.ఇక నేరేడు పండు, ఆకులు, గింజలు, బెరడు లాంటివి ఔషధాల తయారీలో కూడా వాడుతారు.ఇది అధిక రక్త పోటు, అతిమూత్రం లాంటి సమస్యలకు నేరేడు పండు నివారిస్తుంది.అలాగే శరీరంలో క్యాన్సర్ కారకాలు అభివృద్ధి చెందకుండా సహకరిస్తుంది.
కాలేయ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.అలాగే నోటిలో ఏర్పడే అల్సర్లు, పుండ్లు లాంటి వాటిని దూరం చేస్తుంది.
అలాగే చిగుళ్ళను బలంగా చేసి దంత సమస్యలను నివారిస్తుంది.







