చంటి పిల్ల‌ల‌కు ఆవు పాలు ఇవ్వ‌కూడ‌దు..ఎందుకో తెలుసా?

అవు పాలు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్ట‌క‌రం.ఆవు పాల‌ల్లో విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ డి, కాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ప్రోటీన్‌.

 Cow's Milk Should Not Be Given To 1 Year Below Child! Cow Milk,1 Year Below Chil-TeluguStop.com

ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య ప‌రంగా ఆవు పాలు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

అనేక జ‌బ్బులు ద‌రి చేర‌కుండా అడ్డు క‌ట్ట వేస్తాయి.అయితే హెల్త్‌కి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ ఒక సంవ‌త్స‌రం లోపు చంటి పిల్ల‌ల‌కు ఆవు పాలు ఇవ్వ‌కూడ‌ద‌ని అంటున్నారు నిపుణులు.

ఎందుకు ఇవ్వ‌కూడ‌దో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవు పాలల్లో లాక్టోజ్ ఎక్కువ మోతాదులో ఉంటుంది.

అందు వ‌ల్ల‌, చంటి పిల్ల‌ల‌కు ఆవు పాల‌ను ఇస్తే క‌డుపు నొప్పి, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు ఉంటాయి.అలాగే ఆవు పాల‌ల్లో కాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది.

కాల్షియం ఆరోగ్యానికి మంచిదే.కానీ, ఆవు పాల‌ల్లో పిల్ల‌ల‌కు కావాల్సిన దానికంటే ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల‌.

వారిలో ఐరన్ గ్రహించే తత్వం త‌గ్గి పోతుంది.ఫ‌లితంగా ర‌క్త హీన‌తకు దారి తీస్తుంది.

Telugu Child, Cow Milk, Tips, Latest-Latest News - Telugu

చంటి పిల్ల‌ల‌కు ఆవు పాలు ప‌ట్టించ‌డం వ‌ల్ల లూజ్ మోషన్స్, డయేరియాకు గ‌ర‌య్యే అవకాశం ఉంటుంది.వీటి కార‌ణంగా పిల్ల‌ల శ‌రీరంలో నీటి శాతం త‌గ్గిపోయి డీహైడ్రేట్ అయిపోతారు.ఆవు పాల‌ల్లో ప్రోటీన్ పుష్క‌లంగా ఉంటుంది.కానీ, వీటిని చంటి పిల్ల‌ల‌కు ఇస్తే.భ‌విష్య‌త్తులో వారు అధిక బ‌రువు, ఊబ‌కాయం స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అంతే కాదు, ఏడాది లోపు పిల్ల‌ల‌కు ఆవు పాలను ఇవ్వ‌డం వ‌ల్ల జీర్ణ వ్యవస్థపై దుష్పరిణాభం ప‌డి జీవ క్రియ ప‌ని తీరు త‌గ్గిపోతుంది.

కొంద‌రు పిల్ల‌లు అల‌ర్జీల‌కు గుర‌వుతారు.మ‌రియు ఆవు పాల‌ల్లో ఉండే ఎంజైమ్స్ పిల్ల‌ల నిద్ర‌కు ఆటంకాన్ని క‌లిగిస్తాయి.

అందుకే చంటి పిల్ల‌ల‌కు ఆవు పాల‌ను ప‌ట్ట‌కూడ‌ద‌ని.త‌ల్లి పాలు లేదా గేదె పాలు లేదా పిండి పాల‌నే ఇవ్వాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube