హెయిర్ ఫాల్( Hair fall ) తో బాగా ఇబ్బంది పడుతున్నారా.? ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కావడం లేదా.? ప్రతిరోజు ఊడిపోయే జుట్టును చూసి తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారా.? అయితే ఇకపై అస్సలు వర్రీ అవ్వకండి.నిజానికి జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి.అలాగే జుట్టు రాలడాన్ని ఆపడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే షాంపూ హ్యాక్ ను కనుక ఫాలో అయ్యారంటే జుట్టు రాలడం దెబ్బకు కంట్రోల్ అవుతుంది.అలాగే మీ కురులు సూపర్ హెల్తీగా షైనీ గా సైతం మారతాయి.
మరి ఇంతకీ ఆ షాంపూ హ్యాక్ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక అరటిపండును( Banana ) తీసుకుని తొక్క తీయకుండా స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త బాయిల్ అయినాక అందులో మూడు టేబుల్ స్పూన్లు బియ్యం( rice ), కట్ చేసి పెట్టుకున్న అరటిపండు స్లైసెస్, కొన్ని ఆరెంజ్ తొక్కలు( Orange peels ) మరియు రెండు రెబ్బలు కరివేపాకు( curry leaves ) వేసి దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత మీ రెగ్యులర్ షాంపూను అందులో వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.నేరుగా షాంపూ చేసుకునే బదులు ఈ విధంగా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేశారంటే అదిరిపోయే రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

ఈ షాంపూ హ్యాక్ ను ఫాలో అవ్వడం వల్ల జుట్టు రాలడం అనేది చాలా త్వరగా కంట్రోల్ అవుతుంది.అలాగే పొడి జుట్టు సమస్య దూరం అవుతుంది.కురులు స్మూత్ గా సిల్కీ గా మారతాయి.పైగా ప్రస్తుత ఈ వర్షాకాలంలో కొందరికి జుట్టు నుంచి చెడు వాసన వస్తుంటుంది.పైన చెప్పిన విధంగా షాంపూ చేసుకుంటే ఈ సమస్యకు సైతం చెక్ పెట్టవచ్చు.