మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, పోషకాల లోపం, హార్మోనుల అసమతుల్యత, ఒత్తిడి, శరీరంలో సరిపడా నీరు లేకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల కళ్ళ కింద క్యారీ బ్యాగులు (ఉబ్బుగా ఉండటం) ఏర్పడతాయి.వీటి వల్ల చిన్న వయసు వారైనా ముసలి వారిగా కనిపిస్తారు.
పైగా కళ్ళ కింద క్యారీ బ్యాగులు చూసేందుకు చాలా అసహ్యంగా ఉంటాయి.అయితే వీటిని నివారించడంలో కొన్ని కొన్ని టిప్స్ గ్రేట్‌గా సహాయపడతాయి.
మరి ఆ టిప్స్ ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
కళ్ళ కింద ఏర్పడి క్యారీ బ్యాగులను తగ్గించడంలో అవకాడో పండు సూపర్‌గా హెల్ప్ చేస్తుంది.
ముందుగా అవకాడో పండును మెత్తగా పేస్ట్ చేసుకుని అందులో కొద్దిగా తేనె కలిపికళ్ళ కింద అప్లై చేసుకోవాలి.పది, ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనిచ్చి.ఆ తర్వాత కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే.
క్రమంగా కంటి కింద బ్యాగ్స్ తగ్గు ముఖం పడతాయి.

అలాగే బాదం ఆయిల్ కూడా కంటి కింద క్యారీ బ్యాగ్స్ నుంచి విముక్తిని అందిస్తుంది.బాదం ఆయిల్‌ను తీసుకుని కళ్ళ కింద మరియు పైనా అప్లై చేసుకుని కొంత సమయం పాటు మెల్ల మెల్లగా మసాజ్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు చేసి ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కళ్ళను క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.

ఇక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్రాన్ బెర్రీ ఫ్రూట్స్ కళ్ళ కిండి ఏర్పడిన బ్యాగ్య్‌నూ నివారిస్తాయి.అవును, ప్రతి రోజు క్రాన్ బెర్రీ ఫ్రూట్స్‌తో తయారు చేసి జ్యూస్‌ను సేవిస్తే క్రమంగా బ్యాగ్స్ తగ్గి అక్కడ చర్మం బిగుతుగా మారుతుంది.ఇక వీటితో పాటుగా ప్రతి రోజు ఐదు నుంచి ఎనిమిది గంటలు నిద్రించాలి.
వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.కళ్ళకు యూజ్ చేసే కాస్మొటిక్స్ కు దూరంగా ఉండాలి.
పోషకాహారం తీసుకోవాలి.