మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతీ వారానికి ఒక ప్రత్యేకత ఉంది.అయితే ఒక్కో వారం నాడు ఒక్కో దేవుడిని పూజించడం, ఒక్కో పని చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.
అయితే ఒక్కో వారం నాడు ఆయా పనులు చేయాలని మన పెద్దలు చెబుతుంటారు.అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదివారం
.మంగళ కృత్యాలు, ఉత్సవాలు, యుద్ధం, రాజ్యాభిషేకం, ధ్యానం, వ్యవసాయ ప్రారంభం, ఔషధ సేవనం, ఉపదేశం, మంత్రపఠనం, ఉత్తరదిక్కు ప్రయాణం, కెంపుధారణ.
సోమవారం
.ముత్యం, స్పటికం, జలాశయ నిర్మాణం, ఉపనయనం, స్థంభప్రతిష్ట, సంగీత, నృత్య, లలితకళలు, వెండి, తెల్లని వస్త్రధారణ, దక్షిణ దిక్కుప్రయాణం, సమస్త వాస్తుకర్మలు, వ్యవసాయం.
మంగళ వారం
.వెండి, బంగారు, రాగి, ఇత్తడి ఇనుము కొలి మిలో కరిగించుట, కోర్టువ్యవహారం, కందులు, మేలశనగవిత్తనాలు వేయుట, సాహస విషయాలు తూర్పుదిక్కు ప్రయాణం, పగడం ధరించుట.
బుధవారం
.బంగారు నగలు, వాహనం, శిల్పం, విద్యలు, వివాహం, వ్యాపారం, గణితం రత్నాభరణ ప్రక్రియ, యుక్తిపన్నడం, రాజీచేయడం, తోటలు, పెసలు పైరు వేయుట, పడమట దిక్కు ప్రయాణం, మరకతదారణ.బంగారు నగలు, వాహనం, శిల్పం
గురువారం
.యజ్ఞ యాగది కర్మకాండ వివాహాది శుభక్రతువులు, విద్యారంభం, యుద్ధారంభం, దేవపూజ, శనగలు, పుష్యరాగ ధారణ, పడమరదిక్కు ప్రయాణం.
శుక్రవారం
.స్త్రీసంబంధ క్రియలు, ప్రేమ, వివాహపు నిర్ణయాలు వజ్ర,వైడూర్య ఆభరణ ధారణ, సుగంధద్రవ్యాలు, శయ్య, ఉద్యోగప్రయత్నం, కొత్తబట్టలు ధరించడం, సాహిత్య, కళావిషయాలు, ఉత్తరం వైపు ప్రయాణం.
శనివారం
.చెక్కడం, కొట్టడం, సీసపు పనులు, తగరం, ఇనుముపనులు, వెల్డింగ్ గృహనిర్మాణపునాదులు, ఆవులు, కూలీల నిర్మాణం, శనిదోష నివృత్తిపూలు.
DEVOTIONAL