నరదృష్టి మన మీద ఎప్పుడు పడుతుంది అంటే, మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవటం ద్వారా నరదృష్టి మన కుటుంబం మీద పడుతుంది.మనం ఆర్థికంగా రాణి ఇస్తున్నప్పటికీ అది కొంతమందికి లేదా మన శత్రువులకు ఓర్వలేనితనం గా మారుతుంది.
ఇరుగు పొరుగు వారు లేదా మన బంధువుల లో కూడా మనల్ని చూస్తూ అసూయ పెంచుకోవడం ద్వారా వారి చెడు ప్రభావం మన మీద పడుతుంది.నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో అష్ట కష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
మరి ఈ నరదృష్టి పోవాలంటే ఇలా చేయడం ద్వారా దృష్టి నుంచి విముక్తి పొందవచ్చని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.
మనం ఉన్నతమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు కచ్చితంగా మన మీద దృష్టి ప్రభావం ఎంతో ఏర్పడుతుంది.
అలాంటప్పుడు కొందరు ఆ దిష్టి ప్రభావం కుటుంబం మీద పడకుండా ఇంటిలో గుమ్మడికాయ కడుతూ ఉంటారు.మరికొందరు ఇంటి గుమ్మం దగ్గర కను దిష్టి వినాయకుడి ఫోటో పెట్టడం ద్వారా ఎలాంటి దిష్టి అయినా పటాపంచలు అవుతుందని విశ్వసిస్తారు.
వీటితో పాటు ఇంకా ఈ చిన్న పని చేయడం ద్వారా మన కుటుంబం మీద ఎలాంటి నరఘోష పీడా ఉండదు.
నెలలో ఒకసారి ఆదివారం లేదా గురువారం రోజున ఉడకబెట్టిన బంగాళాదుంపను మధ్యాహ్నం 1:00 లోపు ఆవుకు బంగాళాదుంపను పెట్టడం ద్వారా మన కుటుంబం మీద ఏర్పడినటువంటి నరదిష్టి తొలగిపోతుంది.అయితే ఈ పని చేసేటప్పుడు మన ఇంట్లో మాంసాహారం చేయకూడదు.ఇలా నెలలో ఒకసారి చేయడంవల్ల మన కుటుంబం నరదృష్టి నుంచి విముక్తి కలుగుతుంది.అంతేకాక కుండా ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజున మన ఇంటికి దిష్టి తీస్తే ఒక గుమ్మడికాయలు పగులగొట్టడం లేదా నిమ్మకాయల కోసి గుమ్మానికి రెండు వైపులా పెట్టడం ద్వారా ఏటువంటి చెడు ప్రభావం మన కుటుంబం మీద పడదు.