Tirumala: తిరుమలకు వెళ్లే భక్తులకు షాక్ ఇచ్చిన దేవస్థానం.. ఆ సేవలు రద్దు..

మన దేశంలో ఎన్నో దేవాలయాలకు ప్రతి రోజు భక్తుల తో రద్దీ గా ఉంటాయి.భక్తులు వచ్చి దేవాలయంలో పూజలు, దర్శనాలు చేసుకుంటూ భగవంతుని సన్నిధిలో ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు.

 Ttd Board Cancelled That Services To Tirumala Devotees Details, Ttd Board, Cance-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే మరి కొంత మంది వారి మొక్కులను తీర్చుకోడానికి దేవుని సన్నిధి దగ్గరికి వస్తూ ఉంటారు.కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని దేవస్థానాలు భక్తుల రద్దీ ఎక్కువ అవ్వడం వల్లనో లేదా ఇంకా వేరే కారణం వల్లనో కొన్ని సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉంటారు.

దాని వల్ల ఆలయంలో అలాంటి సేవలు చేయడానికి వచ్చిన భక్తులు కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు.ప్రస్తుతం తిరుమల కు వెళ్లే భక్తులకు దేవస్థానం ఇలాంటి ఒక సేవ ను తాత్కాలికంగా నిలిపివేసింది.

టీటీడీ పాలక మండలి ఆర్జిత సేవను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.తిరుమలలో నిర్వహించవలసిన కార్తీక వనభోజన కార్యక్రమాన్ని రద్దు చేసిన టీటీడీ పాలక మండలి భారీ వర్షం కారణంగా ఈ సేవను రద్దు చేసినట్లు తెలిపింది.

దీని వల్ల వైభవోత్సవ మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం అర్చకులు నిర్వహించనున్నారు.

Telugu Arjitha Seva, Bhakti, Cancelled, Devotees, Devotional, Srivenkateswara, T

ఈ అర్జిత సేవను తిరుమల దేవస్థానం వర్షం కారణంగా రద్దు చేసిన భక్తులు మాత్రం ఏమాత్రం తగ్గలేదు.తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా పెరిగిపోయింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల భక్తులు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు.

టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి దాదాపు 40 గంటల సమయం పడుతుందని ఒక అంచనా.అయితే శ్రీ వారిని నిన్న 73,323 మంది వ్యక్తులు దర్శించుకున్నారు.41,041 మంది భక్తులు తల నీలాలు సమర్పించారని ఒక అంచనా.ఇక నిన్న హుండీ ఆదాయం రూ.3.2 కోట్లు గా నమోదు అయిందని తిరుమల దేవస్థానం వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube