నేడే అమావాస్య.. కొత్త సంవత్సరంలో వచ్చిన ఈ అమావాస్య ప్రత్యేకత ఏమిటో తెలుసా?

సాధారణంగా ప్రతి నెల పౌర్ణమి అమావాస్యలు రావడం సర్వసాధారణం నూతన సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య జనవరి 2వ తేదీ ఆదివారం వచ్చింది.ఈ అమావాస్యను పౌష అమావాస్య లేదా దర్శ అమావాస్య అని కూడా పిలుస్తారు.

 New Moon, New Year, First New Moon, Specialty, Sunaday-TeluguStop.com

మతపరంగా ఈ అమావాస్య ఎంతో ముఖ్యమైనది.ఈ అమావాస్య రోజు ఉదయమే స్నానం చేసి ఆలయానికి వెళ్లి దానధర్మాలు చేయడం వల్ల పితృదేవతలకు శాంతి కలుగుతుంది.

చాలామంది ఈ అమావాస్య రోజు పితృదేవతలకు శాంతి కలగాలని దానధర్మాలను చేయడం చేస్తుంటారు.

ఈ క్రమంలోనే గంగాజలంతో స్నానం చేసి రాగి చెంబులు ఎర్రటి పువ్వులు అక్షింతలను కలిపి సూర్యుడికి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ నీటిని సమర్పించాలి.

సూర్యారాధన అనంతరం ఇంటిలో దీపారాధన చేసుకొని ఇష్టదైవాలకు పూజ చేయాలి.ఇక ఈ అమావాస్య తిథి ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అనే విషయానికి వస్తే.

Telugu Moon, Specialty-Latest News - Telugu

అమావాస్య తిథి ప్రారంభం : జనవరి 2 ఆదివారం ఉదయం 3:41 గంటల నుండి ప్రారంభమయ్యి తిరిగి జనవరి 2, ఆదివారం రాత్రి 12: 4 నిమిషాలకు అమావాస్య తిథి ముగుస్తుంది.ఈ శుభ సమయంలోనే ప్రతి ఒక్కరు పేదలకు దానధర్మాలు చేయడం వల్ల వారి పితృదేవతలకు ఆత్మ శాంతి కలుగుతుంది.ఇలా పితృదేవతలకు ఆత్మశాంతి కలగాలని దర్శ అమావాస్య రోజున పాలు, అన్నం ,ఖీర్, కట్టెల పొయ్యి మీద పూర్వీకులకు ఖీర్ నైవేద్యం సమర్పించడం ఎంతో మంచిది.అయితే ఈ నైవేద్యాన్ని దక్షిణదిశగా పెట్టడం ఉత్తమం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube