దేశంలో మరికొద్ది రోజులలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలపై కాంగ్రెస్ నేత రాహుల్ స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది.ఈ ఏడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్( Karnataka assembly elections ) అద్భుతంగా పుంజుకుని అధికారం సంపాదించడం జరిగింది.
ఇదే సమయంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది.సాక్షాత్తు ప్రధాని మోదీ దేశంలో ఏ ఎన్నికలలో పాల్గొని రీతిలో కర్ణాటకలో భారీ ఎత్తున ర్యాలీలలో బహిరంగ సభలలో పాల్గొన్న గాని కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు.
ఇదిలా ఉంటే తాజాగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటిస్తూ ఉన్నారు.పర్యటనలో భాగంగా రైలులో ప్రయాణించారు.బిలాస్ పూర్ లో రైలు ఎక్కిన ఆయన రాయపూర్ వరకు వెళ్లడం జరిగింది.ప్రయాణంలో భాగంగా స్లీపర్ క్లాస్ భోగిలో ప్రయాణికులతో మాట్లాడటం జరిగింది.
వారి సమస్యల గురించి ఇంకా అనేక విషయాలు గురించి రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు.ఇదే సమయంలో రైలులో ప్రయాణిస్తున్న విద్యార్థులతో కూడా ముచ్చటించారు.
ఈ క్రమంలో కొంతమంది రాహుల్ గాంధీ( Rahul Gandhi )తో ఫోటోలు దిగగా.మరి కొంతమంది సెల్ఫీలు దిగారు.
కచ్చితంగా ఛత్తీస్ గఢ్( Chhattisgarh ) రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో గెలుస్తామనే ధీమాలో రాహుల్ ఉన్నారు.