జబర్దస్త్ కామెడీ షో( Jabardast Comedy Show ) ద్వారా ఎంతో మంది కమెడియన్ లు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.జబర్దస్త్ లో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంతోపాటు భారీగా పాపులారిటీని సంపాదించుకున్న వారిలో రాకింగ్ రాకేష్ ( Rocking Rakesh )కూడా ఒకరు.
జబర్దస్త్ అలాగే ఎక్స్ ట్రా జబర్దస్త్ లో చాలా రకాల స్కిట్లు చేసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు రాకేష్.మొన్నటి వరకు జబర్దస్త్ ద్వారా మెప్పించిన రాకేష్ ఇప్పుడు వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు.
హీరోగా నటించడంతో పాటు స్వయంగా తానే సినిమాలు నిర్మించాడు రాకేష్.

కేశవ చంద్ర రమావత్ ( Kesava Chandra Ramawat )అనే సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా కోసం రాకేష్ చాలా గట్టిగానే కష్టపడుతున్నాడు.ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికే మాత్రమే కాకుండా సినిమాను ప్రమోట్ చేయడానికి కూడా రాకేష్ బాగానే కష్టపడుతున్నాడు.
ప్రమోషన్ లకు డబ్బులు లేకనో మరే ఇతర కారణం అన్నది తెలియదు కానీ తన సినిమా పోస్టర్లను తనే అంటించుకుంటూ మీడియా దృష్టిలో పడ్డాడు రాకేష్.హైదరాబాద్ సిటీలో అర్ధరాత్రి తన సినిమా పోస్టర్లను హీరోనే అంటిస్తుండడం చూసి జనం ఆశ్చర్యపోయారు.
సంబంధిత ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫొటోలు, వీడియోలు చూసి సోషల్ మీడియాలో రాకేష్ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్, మేటి, నెటిజన్స్.ఇది ఒక రకమైన ప్రమోషన్ కూడా కావచ్చు అంటున్నారు.కేసీఆర్ సినిమా తీయడానికి తన ఇంటిని కూడా తాకట్టు పెట్టినట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెల్లడించాడు రాకేష్.
ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ఇంకా ఎంత కష్టపడిందీ చెబుతూ అతను ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.అలాగే రాకేష్ భార్య జోర్దార్ సుజాత కూడా ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా తన వంతు పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే.
తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు, ఏపీ మాజీ మంత్రి రోజా, హైపర్ ఆది తదితరులు పాల్గొన్న కేసీఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకేష్, సుజాతలే యాంకర్లుగా వ్యవహరించారు.ం
.






