ప్రపంచం అంతా ఒక వైపు.తారక రత్న మరో వైపు.
ఎవరిని ఎంచుకోవాలి అని ప్రశ్న వచ్చినప్పుడు అలేఖ్య తారక రత్న వెంట నడిచింది.నందమూరి కుటుంబం వేరు, అలేఖ్య పుట్టి పెరిగిన నేపథ్యం వేరు.
రాజకీయంగా ప్రత్యర్ధులు అయిన కుటుంబాల్లో తారక రత్న మరియు అలేఖ్య లు జన్మించారు.కానీ విది వారిని కలపాలని నిర్ణయించుకున్నాక ఎవరు వారిని విడదీయగలరు.
అందుకే ఒక్కటిగా కలిసి ఉన్నారు.పెద్దలను, కుటుంబాలను, రాజకీయాలను పక్కన పెట్టి బార్య భర్తలు అయ్యారు.
తారక రత్న కు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది అలేఖ్య.అక్కడే వారి పరిచయం మొదలయ్యింది.
ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకున్నారు.ఇక విషయం పెళ్లి వరకు దారి తీసింది.
తారక రత్న కెరీర్ పరంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.అయిన అలేఖ్య అతడిని ఎంతగానో ప్రేమించింది.అంతకు మించి సపోర్ట్ సిస్టమ్ గా మారిపోయింది.చాలా మంది సెలబ్రిటీ ల విషయం లో డబ్బులు లేకపోయినా సినిమాలు లేకపోయినా గొడవలు మొదలవుతాయి.అది విడాకులకు దారి తీస్తుంది.కానీ తారక రత్న ను అమే ఎంతగానో ప్రేమించి అడుగడుగున సపోర్ట్ చేస్తూ వచ్చింది.
అందుకే ఇక్కడ కూడా వారి మధ్య గ్యాప్ రాలేదు.పైగా తారక రత్న ను అలేఖ్య చాలా ఎక్కువగా ప్రేమించింది అంటూ బాలయ్య ఒక స్టేట్మెంట్ ఇవ్వడం బట్టి చూస్తే అలేఖ్య పరిస్థితి మనం అర్దం చేసుకోవచ్చు.
ఎప్పుడైతే తారక రత్న రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాడో అందుకు అలేఖ్య సైతం ఒప్పుకుంది.కానీ పచ్చగా ఉన్న వీరి కాపురానికి ఎవరి దిష్టి తగిలిందో కానీ తారక రత్న గుండె పోటు కి గురై 23 రోజుల పాటు పోరాడి మృత్యువు వొడికి చేరుకున్నాడు.తనను ప్రపంచంగా చూసుకున్నా అలేఖ్య ను ఒంటరి దాన్ని చేసి ముగ్గురు పిల్లలను అమే చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు.ఇక పై అమే ఒంటరి ప్రయాణం చేయాలి.
మోహన్ కృష్ణ కుటుంబం ఎంతలా ఆదరిస్తుంది అనేది అనుమానమే.మొదటి నుంచి తారక రత్న కు అండగా ఉన్న బాలయ్య అలేఖ్య మరియు పిల్లల బాధ్యత తీసుకున్నట్టు తెలుస్తుంది.