Skin Whitening : సహజంగానే చర్మాన్ని సూపర్ వైట్ గా మార్చే ఎగ్ మాస్క్.. డోంట్ మిస్!

సాధారణంగా ఒక్కోసారి చర్మం నల్లగా కాంతిహీనంగా తయారవుతుంటుంది.ఎండలో ఎక్కువగా తిరగడం, ఆహారపు అలవాట్లు, చర్మం పై మృతకణాలు పేరుకుపోవడం తదితర కారణాల వల్ల స్కిన్ డార్క్ కలర్( Dark Skin Color ) లోకి మారుతుంటుంది.

 Try This Egg Mask For Super White Skin-TeluguStop.com

దాంతో తీవ్ర అసహనానికి లోనవుతుంటారు.చర్మాన్ని మళ్ళీ తెల్లగా మార్చుకునేందుకు రకరకాల క్రీములు వాడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఎగ్ మాస్క్ మీకు చాలా బాగా సహాయపడుతుంది.ఈ మాస్క్ తో సహజంగానే చర్మాన్ని సూపర్ వైట్ గా మార్చుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఎగ్ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గుడ్డు పచ్చ సొన వేసుకోవాలి.

-Telugu Health

ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ తేనె, మూడు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు( Raw Milk ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

రోజుకు ఒకసారి ఈ విధంగా చేశారంటే మీ స్కిన్ లో అనేక మార్పులు గమనిస్తారు.ఈ హోమ్ రెమెడీ మీ చర్మాన్ని సహజంగానే తెల్లగా, కాంతివంతంగా మారుస్తుంది.

గుడ్డు ప‌చ్చ‌సొన‌( Egg yolk ) లో విటమిన్స్, మిన‌ర‌ల్స్ మెండుగా ఉంటాయి.అవి చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.

-Telugu Health

చర్మానికి చక్కని తేమను చేకూరుస్తాయి.వృద్ధాప్య ఛాయలు త్వ‌ర‌గా ద‌రిచేర‌కుండా అడ్డుకట్ట వేస్తాయి.చ‌ర్మ రంగును మెరుగుప‌రుస్తాయి.అలాగే శనగపిండి, తేనె, పాలు ఇవన్నీ కూడా స్కిన్ హెల్త్( Skin Health ) ను ప్రమోట్ చేస్తాయి.స్క్రీన్ టోన్ ఇంప్రూవ్ చేస్తాయి.చర్మాన్ని అందంగా మెరిపిస్తాయి.

కాబట్టి తెల్లటి మెరిసే అందమైన చర్మాన్ని కోరుకునే వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న ఎగ్ మాస్క్ ను మిస్ కాకుండా ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube