ఖాళీ క‌డుపులో అల్లం నీరు తాగొచ్చా.. తాగ‌కూడ‌దా.. క‌చ్చితంగా తెలుసుకోండి!

అల్లం( ginger ) దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ వాడతారు‌.వివిధ రకాల వంటల్లో అల్లాన్ని వినియోగిస్తారు.

 Is It Good To Drink Ginger Water On An Empty Stomach Ginger Water, Ginger Water-TeluguStop.com

అలాగే ఇటీవల కాలంలో చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగడం అలవాటు చేసుకుంటున్నారు.సెలబ్రిటీలు( Celebrities ) కూడా ఇది ఫాలో అవుతుండడంతో.

సోషల్ మీడియాలో జింజర్ వాట‌ర్‌ బాగా ట్రెండ్ అవుతోంది.అయితే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగొచ్చా.? అసలు అలా తీసుకోవ‌డం ఆరోగ్యానికి మంచిదేనా.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లంలో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, కాపర్, జింక్, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలు మరియు విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.పురాతన వైద్యం లో వివిధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి అల్లం ఒక మూలికగా ఉపయోగించేవారు.

అందువ‌ల్ల ఖాళీ క‌డుపుతో అల్లం నీరు( Ginger water ) తాగితే లాభాలే త‌ప్ప ఎటువంటి న‌ష్టాలు ఉండ‌వు.అల్లం వేసి మ‌రిగించిన నీటిని ఉద‌యం ఖాళీ క‌డుపుతో తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు పొందుతారు.

Telugu Empty Stomach, Ginger, Ginger Benefits, Tips, Gingerempty-Telugu Health

ముఖ్యంగా అల్లం నీరు సహజ రోగనిరోధక బూస్టర్‌గా పని చేస్తాయి.శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా బలపరుస్తాయి.అలాగే మ‌ధుమేహం( diabetes ) వ్యాధిగ్ర‌స్తుల‌కు అల్లం నీరు ఒక వ‌రం అనే చెప్పుకోవ‌చ్చు.ఎందుకంటే, జింజ‌ర్ వాట‌ర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యానికి కూడా ప్రసిద్ధి చెందింది.

ఖాళీ క‌డుపుతో అల్లం నీరు తాగ‌డం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గుతుంది.గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

Telugu Empty Stomach, Ginger, Ginger Benefits, Tips, Gingerempty-Telugu Health

అంతేకాకుండా ఆర్థరైటిస్ ఉన్న వారికి అల్లం నీరు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పుల ఉపశమనానికి తోడ్ప‌డ‌తాయి.అల్లం నీరు శరీర కొవ్వును వేగంగా కాల్చేస్తుంది.బ‌రువు త‌గ్గ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.మ‌రియు అల్లం నీరు తాగితే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం సైతం త‌గ్గుతుంది.కాబ‌ట్టి ఖాళీ క‌డుపుతో అల్లం నీరు తాగ‌డానికి ఏ మాత్రం సంకోచించ‌కండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube