1.రఘురామ ను ఎందుకు సస్పెండ్ చేయలేదు
వైసీపీ నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తన సస్పెన్షన్ పై తాజాగా స్పందించారు.వైసీపీపై తాను బహిరంగంగా విమర్శలు చేయకపోయినా , తనను సస్పెండ్ చేశారని కానీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను ఎందుకు సస్పెండ్ చేయడం లేదో చెప్పాలని కొత్తపల్లి డిమాండ్ చేశారు.
2.మరో పోరాటానికి సిద్ధమవుతున్నాం : కోదండరాం
తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం అవుతున్నారని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు.
3.కాంగ్రెస్ పార్టీకి బండి సంజయ్ సవాల్
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు.కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే భాగ్యలక్ష్మి ఆలయాన్ని మూసివేయించాలి అని సవాల్ విసిరారు.
4.అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లిన ప్రియాంక గాంధీ
ఉత్తరప్రదేశ్ లోని లక్ నవు లో రెండు రోజులపాటు నిర్వహించాల్సిన ‘నవ సంకల్ప కార్యశాల ‘ లో పాల్గొనడానికి వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అకస్మాత్తుగా తన పర్యటన ముగించుకుని ఢిల్లీ కి వెళ్లారు.దీంతో ఆమె ఆకస్మిక పర్యటన పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
5.తెలంగాణ ప్రజలకు మోదీ, అమిత్ షా శుభాకాంక్షలు
తెలంగాణ ప్రజలు నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ లో తెలుగులో శుభాకాంక్షలు తెలియజేశారు.
6.బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్
గుజరాత్ పటేదార్ నేత హార్దిక్ పటేల్ నేడు బీజేపీలో చేరారు.
7.అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం : కేఏ పాల్
తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ ప్రకటించారు.
8 సోనియా గాంధీకి కరోనా
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
9.కెసిఆర్ పై విహెచ్ ఆగ్రహం
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని విమర్శించారు.
10.రేవంత్ రెడ్డి కామెంట్స్
టిఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల జీవితాలు చితికిపోయి అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.
11.తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అను కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తెలియజేశారు.
12.జాతీయ జెండాను ఆవిష్కరించిన హరీష్ రావు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో మంత్రి హరీష్ రావు జాతీయ జెండా ఆవిష్కరించారు.
13.తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చిన్నారి స్నితిక్
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎస్సార్ నగర్ కు చెందిన నూక తోటి స్నితిక్ ప్రాశ్ రే (6) స్థానం సంపాదించాడు.
14.కేంద్రం పై కెసిఆర్ కామెంట్స్
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలు అనేక రకాలుగా నష్టపోయారని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు.
15.అందుకు నేనే స్వయంగా రూపకల్పన చేశా : కేసిఆర్
దళిత బంధు పథకానికి తానే రూపకల్పన చేశానని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు.
16.కర్నూలు విద్యార్థికి అమెజాన్ 1.3 కోట్ల ప్యాకేజీ
కర్నూల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నోలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కు చెందిన ఓ విద్యార్థి కి ఇంటర్వ్యూలు అమెజాన్ సంస్థ 1.3 కోట్ల ప్యాకేజీతో ఎంపిక చేసింది.
17.రిసార్ట్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు
రాజ్యసభ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో రాజస్థాన్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రహస్యంగా ఓ రిసార్ట్ కు తరలించారు.
18.మా అందరినీ అరెస్ట్ చేయండి : కేజ్రీవాల్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.ఈ నేపథ్యంలో అరెస్ట్ చేయించండి అంటూ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
19.గౌరవం లేని చోట ఉండలేక నే రాజీనామా : దివ్య వాణి
తెలుగుదేశం పార్టీలో ఏడాది నుంచి తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని నన్ను కుక్క పిల్లలా ఆడుకున్నారు అని, గౌరవం లేని చోట ఉండలేకనే తాను రాజీనామా చేసినట్లు టిడిపి అధికార ప్రతినిధిగా పనిచేసిన దివ్యవాణి పేర్కొన్నారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,600 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,930
.