టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్( Jani Master ) గురించి మనందరికీ తెలిసిందే.మొన్నటి వరకు జానీ మాస్టర్ పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే సోషల్ మీడియాలో మారుమోగిపోయింది.
లైంగిక వేధింపుల కేసులో భాగంగా ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు జైలు పాలైన విషయం తెలిసిందే.కొద్దిరోజుల పాటు జైలు జీవితాన్ని కూడా గడిపి వచ్చారు జానీ మాస్టర్.
జైలు నుంచి వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు ఇంటికే పరిమితమయ్యాడు జానీ మాస్టర్.అయితే జానీ మాస్టర్ జైల్లో ఉన్న సమయంలో చాలా వరకు ఆయనకు అవకాశాలు దూరమైన విషయం తెలిసిందే.
తాను ఏ తప్పూ చేయలేదని విచారణలో అన్ని నిజాలు బయటికొస్తాయంటోన్న జానీ ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు.ఇది ఇలా ఉంటే తాజాగా అతనికి మరో సినిమా అవకాశం వచ్చింది.కన్నడలో తెరకెక్కుతోన్న ఒక సినిమాకు జానీ వర్క్ చేయనున్నాడు.తాజాగా తన కొత్త సినిమా సెట్ కు వెళ్లాడు మాస్టర్.అక్కడ అతనికి ఊహించని స్వాగతం లభించింది.జానీ మాస్టర్‌కి గుమ్మడి కాయతో దిష్టి తీసి హారతిచ్చి సెట్స్ లోకి ఆహ్వనించారు.
అంతేకాకుండా కేక్ కట్ చేయించి మరీ గ్రాండ్ వెల్కమ్( Grand Welcome ) చెప్పారు.అయితే అదంతా చూసి జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు.
అందరికీ థ్యాంక్స్ చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడీ స్టార్ కొరియోగ్రాఫర్.
చాలా రోజుల తర్వాత బెంగళూరులో( Bengaluru ) అడుగు పెట్టాను.యూవర్స్ సిన్సియర్లీ రామ్( Yours Sincerely Raam ) సెట్స్ లో అడుగుపెట్టిన నాకు ఇంతటి ఘన స్వాగతం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చిన ఈ మూవీ టీమ్ ప్రతి ఒక్కరికీ ఎంతో రుణపడి ఉంటాను అంటూ జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ పోస్ట్ పై అభిమానులు స్పందిస్తూ రకరకాలగా కామెంట్లు చేస్తున్నారు.