చర్మం ఆరోగ్యంగా మృదువుగా ఉండాలంటే మాయిశ్చరైజర్ ను కంపల్సరీ రాసుకోవాలి.ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల మాయిశ్చరైజర్స( Moisturizers ) అందుబాటులో ఉన్నాయి.
ఎవరికి నచ్చింది వారు కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే ఇంట్లో కూడా మాయిశ్చరైజర్ ను తయారు చేసుకోవచ్చు.
ఈ మాయిశ్చరైజర్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.పైగా ఇది మీ చర్మాన్ని స్మూత్ అండ్ షైనీ గా మెరిపిస్తుంది.
మరెన్నో స్కిన్ కేర్( Skin Care ) బెనిఫిట్స్ ను అందిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఇంట్లోనే ఈజీగా మాయిశ్చరైజర్ ను ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వైట్ రైస్( White Rice ) వేసి రెండు సార్లు వాటర్ తో వాష్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న బియ్యంను వాటర్ తో సహా అందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి రైస్ జ్యూస్ ను స్టైనర్ సహాయంతో సపరేట్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్, మూడు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ) వేసి బాగా ఉడికించాలి.జెల్లీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
స్ట్రైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో అవిసె గింజల జెల్ ను వేసుకోవాలి.
ఆ తర్వాత అరకప్పు రైస్ జ్యూస్ మరియు మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ), ఆరు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి.

ఒక ఐదు నిమిషాల పాటు స్పూన్ లేదా విస్కర్ సహాయంతో కలిపితే మన మాయిశ్చరైజర్ ( Homemade Moisturizer )సిద్ధం అవుతుంది.దీన్ని ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు వాడుకోవచ్చు.ఈ న్యాచురల్ మాయిశ్చరైజర్ ను వాడటం వల్ల చర్మం ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది.
స్కిన్ స్మూత్ అండ్ షైనీ గా మెరుస్తుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.
మరియు ఈ హోమ్ మేడ్ మాయిశ్చరైజర్ ను వాడితే డ్రై స్కిన్( Dry Skin ) అన్న మాట అనరు.







