వేసవి కాలం( summer season ) వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా మామిడి పండ్లు కనువిందు చేస్తుంటాయి.ఈ కాలాన్ని మామిడిపండ్ల సీజన్ అని కూడా అంటుంటారు.
పెద్దలు, పిల్లలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా మామిడి పండ్లను( Mangoes ) తింటుంటారు.రుచితో పాటు మామిడి పండ్లలో బోలెడన్ని విలువైన పోషకాలు నిండి ఉంటాయి.
అవి ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.
అయితే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే మామిడి పండును తిని తొక్కను పారేస్తుంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేతులారా పారేసినట్లే.నిజానికి మామిడి పండు మాత్రమే కాదు మామిడి పండు తొక్క కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా బరువు తగ్గాలని భావిస్తున్న వారు మామిడి పండును తొక్కతో పాటు తినాలని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే మామిడి పండును తొక్కతో పాటు తింటే వెయిట్ లాస్ అవుతారని నిరూపించబడింది.
అలాగే మామిడి పండు తొక్క లో క్యాన్సర్ కణాలు ( Cancer cells )వృద్ధి చెందకుండా అడ్డుకునే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.మామిడి పండును తొక్క పాటుగా తింటే ఊపిరితిత్తుల క్యాన్సర్, మెదడు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ మరియు పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది.ఇక మామిడి పండు తొక్కలను ఎండలో బాగా ఎండబెట్టి పొడి చేసుకుని రోజు వాటర్ లో కలిపి తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా మారుతుంది.జీర్ణ వ్యవస్థ చురుగ్గా పని చేస్తుంది.మరియు వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.చర్మం యవ్వనంగా సైతం మెరుస్తుంది.
కాబట్టి ఇకపై మామిడి పండు తొక్కను పొరపాటున కూడా పారేయకండి.