బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) మనవరాలు, అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ ల ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్( Aaradhya Bachchan ) తాజాగా మరొకసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.గత ఏడాది తన ఆరోగ్యం విషయం గురించి తప్పుడు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్ పై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
అంతేకాకుండా ఆ కథనాలను తొలగించాలి అంటూ ఆమె హైకోర్టును( High Court ) ఆశ్రయించింది.ఆరాధ్య పిటిషన్ పై కోర్టు తీవ్రంగా స్పందించింది.
ఆమె పిర్యాదును చేసినప్పుడు ఆ వీడియోలను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.అయినప్పటికీ కొన్ని వెబ్సైట్లు సోషల్ మీడియా అకౌంట్ లు కోర్టు ఇచ్చిన తీర్పుని ఫాలో అవ్వలేదు.

దాంతో మరొకసారి కోటిని ఆశ్రయించింది ఆరాధ్య బచ్చన్. అసలేం జరిగిందంటే.గత ఏడాది కొన్ని యూట్యూబ్ ఛానల్ వారు ఆరాధ్య బచ్చన్ అనారోగ్యం అంత బాగోలేదని ఆమె పరిస్థితి క్షీణించిందని ఆరోగ్య ఇక లేరు అంటూ తప్పుడు ప్రచారాలు చేశారు.ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు తీవ్రంగా స్పందించింది.
పిల్లల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం చాలా తప్పు అని, ఇలాంటి చర్యలు సమాజంలో అనారోగ్యకరమైన వక్రబుద్ధిని ప్రతిబింబిస్తుందని కోర్టు తెలిపింది.సమాజంలోని ప్రతి చిన్నారిని గౌరవంగా చూడటంతో పాటు వారి ఆరోగ్యానికి సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చేయడాన్ని చట్టం ఎట్టిపరిస్థితిల్లోనూ సహించదని కోర్టు పేర్కొంది.

ఇలాంటి వీడియోలు గూగుల్( Google ) దృష్టికి వచ్చినప్పుడు వాటిని తక్షణమే తొలగించాలని న్యాయస్థానం తెలిపింది.అయితే, కొన్ని ఇంకా నెట్టింట వైరల్ అవుతున్నాయి.దీంతో తన తండ్రితో పాటు ఆరాధ్య నేరుగా హైకోర్టుని ఆశ్రయించడంతో గూగుల్ కు మరోసారి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.ప్రస్తుత పిటిషన్‌పై విచారణ మార్చి 17న జరగనుందని తెలిపింది.
మరి ఇప్పటికైనా సోషల్ మీడియా నుంచి ఆరోగ్యకు సంబంధించిన వీడియోలు పోస్టులు డిలీట్ చేస్తారేమో చూడాలి మరి.







