తల్లిపాలు.బిడ్డకు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.బిడ్డ మొదటి ఆరు నెలలు తల్లి పాలు తాగతే.భావిష్యత్తు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చట.ఎందుకంటే.బిడ్డకు పోషణ, రక్షణ ఇచ్చేది తల్లిపాలే.
రోగనిరోధకశక్తి బలోపేతం చేసేది కూడా తల్లిపాలే.అందుకే అంటారు తేనె కంటే తీయనివి, అమృతం కంటే మధురమైనవి తల్లిపాలే అని.ఇది అక్షరాల సత్యం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.అలాగే తల్లిపాల వల్ల పిల్లల్లో తెలివి తేటలు కూడా పెరుగుతాయి.
అయితే కొంతమంది పాలిచ్చే సమయంలో మద్యాన్ని సేవిస్తుంటారు.కాని అమృతం లాంటి తల్లిపాలలో.విషంలాంటి మద్యం కలిపితే చాలా ప్రమాదమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.సాధారణంగా తల్లి ఏం తీసుకుంటే అది తల్లిపాలల్లోకి చేరుతుంది.ఇది మద్యం విషయంలోనూ వర్తిస్తుంది.దీంతో పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ఎందుకంటే.తల్లిపాలల్లో అవసరమైన ముఖ్యపోషకాలన్నీ సమపాలంలో ఉంటాయి.అయితే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆ పోషకాల విలువలు తగ్గుతాయి.దీంతో బిడ్డకు సరైన పోషకాలు అందకపోగా.వారికి భవిష్యత్తులో లివర్ సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువ.అలాగే ఆల్కహాల్ ఉన్న తల్లిపాల వల్ల పిల్లల్లో తెలివితేటలు కూడా తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు.
ఇక భవిష్యత్తులో రోగనిరోధకశక్తిని పెంపొందించి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడగల పోషకాలు తల్లిపాలలో మాత్రమే ఉన్నాయి.కానీ, ఎప్పుడైతే తల్లిపాలలో ఆల్కహాల్ కలుస్తుందో.రోగనిరోధకశక్తి అవసరం అయ్యే పోషకాలు బిడ్డలకు అందకుండా పోతాయి.దీని భావిష్యత్తులో పిల్లలు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కాబట్టి, పాలిచ్చే తల్లులు మద్యానికి దూరంగా ఉంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.