ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన పుష్ప2 ( Pushpa 2 ) సినిమా డిసెంబర్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల పాట్నాలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఇలా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి లక్షలాదిమంది అభిమానులు రావడంతోనే ఈ సినిమా కోసం ఎంతలా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు అర్థమవుతుంది.
ఇక ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఈ వీడియో పై ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేయడమే కాకుండా చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేశారు.ఈ క్రమంలోనే వైకాపా నాయకుడు నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి( Shilpa Ravi chandra Kishore Reddy ) అల్లు అర్జున్ కు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేశారు.అల్లు అర్జున్ ఇటీవల పలు బ్రాండ్లను ప్రమోట్ చేయగా అందుకు సంబంధించిన ఉత్పత్తులను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.
వైల్డ్ ఫైర్ ను బిగ్ స్క్రీన్ పై చూడటం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ బన్నీ అంటూ పోస్ట్ చేయగా అల్లు అర్జున్ సైతం రిప్లై ఇచ్చారు.
థాంక్యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్ అంటూ అల్లు అర్జున్ రిప్లై ఇవ్వడంతో మరోసారి వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.అల్లు అర్జున్ జనసేన పార్టీకి కాకుండా తన స్నేహితుడు శిల్పా రవి కోసం ఏకంగా నంద్యాల వెళ్లి తనకు మద్దతు తెలియజేశారు.ఇక ఈ విషయం గురించి మెగా అభిమానులు అలాగే మెగా హీరోలు అల్లు అర్జున్ ను మెగా కుటుంబానికి దూరం చేసిన సంగతి తెలిసిందే.