ప్రతి తండ్రికి కూతురు ప్రేషియస్ గానే కనిపిస్తుంది.తన కూతురు కు చిట్టి చిట్టి నడకను మాత్రమే కాదు.
సమాజంలో ఎలా జీవించాలి అనే విషయం కూడా తండ్రి దగ్గర నుండే కూతురు నేర్చుకుంటుంది.మరి మాములు తండ్రులే కూతుర్లను ప్రిన్సెస్ లాగా చూసుకుంటే.
ఇక హీరోలు అయితే ఎలా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.స్టార్ హీరోల కూతుర్లకు కూడా వాళ్లకు ఉన్నత ఫాలోయింగ్ ఉంది.
మరి అలంటి స్టార్ డాటర్స్ ఎవరో తెలుసుకుందాం.
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ను మెగా ప్రిన్సెస్ గా ట్రీట్ చేస్తూ ఉంటారు.
ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.ఈమె ప్రెసెంట్ పెళ్లి చేస్కుని మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే నిర్మాతగా కూడా రాణించడానికి ప్రయత్నాలు చేస్తుంది.
మంచు లక్ష్మి గురించి తెలియని వారు ఉండరు. మోహన్ బాబు కూతురుగా ఈమె కెరీర్ స్టార్ట్ చేసి నటిగా, నిర్మాతగా కొనసాగుతుంది.
ఈమె తన తండ్రికి ప్రిన్సెస్ అనే చెప్పాలి.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి అసలు చెప్పాల్సిన పని లేదు.ఈమె ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందే సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మహేష్ కూడా సితార అంటే పంచ ప్రాణాలు.
ఈయన సితార ను ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తాడు.
ఇక అల్లు అర్జున్ కూతురు అర్హ అయితే అల్లు ప్రిన్సెస్ అనే చెప్పాలి.
అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా వెలుగు వెలుగుతుంటే.ఈయనకు మాత్రం కూతురు అంటే పంచ ప్రాణాలు.
ఈమెతో ఎప్పుడు కాళీ సమయం దొరికినా అల్లు అర్జున్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.ఇలా అర్హ ఒక ప్రిన్సెస్ లా ట్రీట్ చేయబడుతుంది.
ఇక అర్హ కూడా డాడీ బాటలోనే నటిగా అడుగు పెట్టబోతోంది.శాకుంతలం సినిమా ద్వారా ఈమె బాలనటిగా అడుగు పెడుతుంది.
మెగాస్టార్ కూతుర్లు సుస్మిత, శ్రీజ కూడా పరిశ్రమలో రాణిస్తున్నారు.చిరుకి కూడా ఇద్దరు కూతుర్లు అంటే ప్రాణం.ఈయన ట్రీట్ చేసే విధానానికి మెగా ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతూ ఉంటారు.
నందమూరి బాలకృష్ణ కు కూడా ఇద్దరు కుమార్తెలు.
బ్రాహ్మణి, తేజస్విని.ఇద్దరు సినీ రంగాన్ని ఎంచుకోక పోయిన వీరికి బాగానే ఫాలోయింగ్ అయితే ఉంది.
వీరిద్దరూ కూడా బాలయ్య కు ప్రిన్సెస్ లు అనే చెప్పాలి.
పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య కూడా సోషల్ మీడియాలో చేరి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుంది.
ఈమె పవన్ కు ప్రిన్సెస్.వీరి అనుబంధం బయట తక్కువుగా కనిపించిన పవన్ కు ఆద్య అంటే చాలా ఇష్టం అనే చెప్పాలి.
ఇలా మన టాలీవుడ్ లో తండ్రులు హీరోలుగా చెలామణీ అవుతుంటే ఆ తండ్రులకు వారి కూతురులు ప్రిన్సెస్ లు అనే చెప్పాలి.అందుకే ప్రేక్షకులు వీరిని కూడా సెలెబ్రిటీలు లాగా ట్రీట్ చేస్తుంటారు.
ఇలా సెలెబ్రిటీల కూతురులందరి తరపున వారి తండ్రులకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు.