కార్తీక్( Karthik )… సీతాకోకచిలుక వంటి ఒక అద్భుతమైన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అన్వేషణ( Anveshana ) అభినందన వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు కానీ ఆ తర్వాత ఒక స్టార్ హీరో అవుతాడనుకున్న కార్తీక్ కొన్ని కారణాల చేత కెరియర్ మొత్తం పతనం అయిపోయి ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి విలన్ గా అవతారం ఎత్తాడు.
మరి ఇంత మంచి సినిమాలో నటించిన కార్తీక్ కెరియర్ పతనం కావడానికి గల కారణాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సీతాకోకచిలుక, అన్వేషణ, గోపాల్ రావు గారి అబ్బాయి, అభినందన( Abhinandana ) వంటి సినిమాల్లో నటించిన కార్తీక్ తెలుగులో స్టార్ హీరోగా ఎదిగాడు.అదే సమయంలో భాగ్యరాజు( Bhagyaraju ) దర్శకత్వంలో తమిళ్ లో కూడా పరిచయమై అక్కడ కూడా మంచి సినిమాల్లోనే నటించాడు అయితే అతడు హీరోగా బాగా పుంజుకున్న తర్వాత ఒక హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకోవడంతో అతడి కెరియర్ నెమ్మదించింది.అదే క్రమంలో హీరోయిన్ రాగిణి( Ragini ) తో వివాహం జరిగింది.
వారికి ఇద్దరు పిల్లలు పుట్టాక రాగిణి చెల్లి రతితో ప్రేమలో మునిగితేలాడు కార్తీక్.అయితే ఈ ఇద్దరితో గల వ్యవహారం కార్తీక్ కి చాలా ఇబ్బందులను సృష్టించాయి తర్వాత రతి గర్భవతి కావడంతో ఆమెను కూడా వివాహం చేసుకోవాల్సి వచ్చింది.

అదే సమయంలో కార్తీక్ సోదరీమణులు కూడా ఆస్తి కోసం కోర్టుకి వెళ్లడంతో మరోసారి అతడి జీవితం కుదుపులకు గురైంది.ఇలా ఇంత బయట గొడవలు కోర్టు వ్యవహారాలతో సినిమాల్లో నటించడం తగ్గించాడు.సమయానికి వెళ్ళకపోవడం, మద్యపానం, డ్రగ్స్ వంటి వాటికీ బానిస అవడం కూడా కార్తీక్ పతనానికి కారణమయ్యాయి.ఇక రమేష్ కన్నా అనే ఒక డైరెక్టర్ తీసిన మొదటి చిత్రం కార్తిక్ హీరోగా రాగా ఇప్పటికీ కూడా అది విడుదలకు నోచుకోలేదు.
ఇలా మొత్తంగా కార్తీక్ తన కెరీర్ ను కోల్పోయి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు.