చర్మానికి స్క్రబ్బింగ్ ఎంతో ముఖ్యం.స్క్రబ్బింగ్‌ను ఎవైడ్ చేస్తే చర్మంపై మురికి, మృత కణాలు పేరుకుపోయి రకరకాల సమస్యలు తలెత్తుతాయి.
అందుకే వారంలో కనీసం రెండు సార్లు ఖచ్చితంగా స్క్రబ్ చేసుకోవాలి.అయితే చాలా మంది స్క్రబ్బింగ్ కోసం మార్కెట్‌లో లభ్యమయ్యే ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.
కానీ, మనం ఇంట్లో తయారు చేసుకునే ఎండు కొబ్బరి పొడిని స్క్రబ్బింగ్‌కి వాడితే.మస్తు స్కిన్ కేర్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.
మరి ఇంకెందుకు లేట్ ఎండు కొబ్బరి పొడితో స్క్రబ్ ఎలా చేసుకోవచ్చో చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, ఒక స్పూన్ బ్రౌన్ షుగర్ పౌడర్, రెండు స్పూన్ల కొబ్బరి పాలు మరియు ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమానికి ముఖానికి, మెడకు కావాలి అనుకుంటే చేతులకు కూడా అప్లై చేసుకుని స్మూత్‌గా నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి.

అనంతరం గోరు వెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.వారంలో రెండంటే రెండు సార్లు ఇలా ఎండు కొబ్బరి పొడితో స్క్రబ్ చేసుకుంటే.డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి.
ట్యాన్ తొలిగిపోతుంది.స్కిన్ టోన్ పెరుగుతుంది.
మరియు ముడతలు, మచ్చలు ఉన్నా పోయి.చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
అలాగే ఎండు కొబ్బరి పొడిని యూజ్ చేసి మరో విధంగా కూడా స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు.అందు కోసం ఒక బౌల్ తీసుకుని అందులో మూడు స్పూన్ల కొబ్బరి పొడి, ఒక స్పూన్ బియ్యం పిండి, రెండు స్పూన్ల తేనె మరియు కొద్దిగా టమాటా రసం వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమానికి ఫేస్‌కి, నెక్‌కి పట్టించి కాసేపు స్క్రబ్ చేసుకోవాలి.ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా స్క్రబ్ చేసుకుంటే.మృతకణాల తొలిగిపోయి చర్మం మృదువగా, తేమగా మారుతుంది.
మరియు మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు సైతం పోతాయి.