వేసవి కాలం ప్రారంభం అయింది.ఎండలు ఏ స్థాయిలో మండిపోతున్నాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.
ఎండల దెబ్బకు ప్రజలు బయట కాలు పెట్టేందుకే భయపడుతున్నారు.ఎండల కారణంగా వడదెబ్బ, డీహైడ్రేషన్, నీరసం, అలసట వంటి సమస్యలు ఎంతగానో ఇబ్బంది పెడుతుంటాయి.
అయితే వీటి నుంచి రక్షణ పొందాలంటే డైట్ లో కొన్ని కొన్ని ఆహారాలను ఖచ్చితంగా చేసుకోవాల్సిందే.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే జావను ప్రతి రోజు తీసుకుంటే వేసవిలో ఈ ఆరోగ్యానికి తిరుగే ఉండదు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జావ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.
అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

మినుములు జావ.వేసవి కాలంలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.దీనిని తయారు చేసుకోవడం పెద్ద కష్టమైన పనేమి కాదు.
స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు మినుములు( Vigna mungo ), వన్ టేబుల్ స్పూన్ బియ్యం మరియు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ) వేసి బాగా వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న పదార్థాలను ఒక గిన్నెలో వేసుకుని రెండు గ్లాసుల వాటర్ పోసి నాలుగు లేదా ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ లో నానబెట్టుకున్న పదార్థాలను వేసి స్మూత్ పేస్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెం గా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి.ఆపై స్పూన్ తో తప్పకుండా కనీసం పది నిమిషాల పాటు ఉడికించాలి.
చివరగా మూడు టేబుల్ స్పూన్ల బెల్లం తురుము, చిటికెడు ఉప్పు( Jaggery ) వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే మన మినుముల జావ సిద్ధం అయినట్టే.ఈ జావ రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ప్రస్తుత వేసవిలో రోజు ఈ జావను తీసుకుంటే నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.వడదెబ్బ నుంచి రక్షణ లభిస్తుంది.బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.శరీంలో అధిక వేడి తొలగిపపోతుంది.

ఈ మినుముల జావ మీ బాడీని శక్తివంతంగా మారుస్తుంది.చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు.అలాంటి వారు ఈ జావను తీసుకుంటే ఎముకల సాంద్రత పెరుగుతుంది.నొప్పులు దూరం అవుతాయి.కండరాల నిర్మాణానికి కూడా ఈ జావ ఉత్తమంగా సహాయపడుతుంది.మరియు ఈ మినుముల జావను తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కూడా ఉంటాయి.