బ్యాంక్ కస్టమర్లకి అలర్ట్... ఈ మేలో 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి!

మనలో ప్రతి ఒక్కరికీ బ్యాంక్ పని అనేది ఏదోఒక రూపంలో ఉంటూనే ఉంటుంది.ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితాలు వివిధ బ్యాంకులతో ముడిపడి ఉంటాయి.

 Alert To Bank Customers Banks Will Be Closed For 12 Days This May , Bank Account-TeluguStop.com

ఎందుకంటే మనీ అనేది ఇపుడు మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది కనుక.అలా ప్రతి రోజు బ్యాంకుల పని నిమిత్తం వెళ్లే వారు చాలా మందే ఉంటారు ఇక్కడ.

అందుకే బ్యాంకులు ఏయే నెలలో ఏయే రోజుల్లో మూసి ఉంటాయన్న విషయం కూడా తెలుసుకోవడం ఉత్తమం.ఇవి తెలుసుకోకపోతే సమయం వృథా కావడంతో పాటు కొంత ఆర్థిక నష్టం కూడా సంభవించే అకాశాలు ఉంటాయి.

పండుగలు, వారాంతాల్లో ఎక్కువగా దేశవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు మూసివేయబడతాయి.బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా( Reserve Bank of India ) (ఆర్బీఐ) ప్రతినెల విడుదల చేస్తుంటుంది.అయితే విడుదల చేసిన జాబితాలో బ్యాంకుల సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు గానీ ఇంచుమించుగా ఇవి ఒకేవిధంగా ఉంటాయి.ఏప్రిల్‌ నెల మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది.మే నెల రాబోతోంది.అయితే వచ్చే నెలలో బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెలవులు రానున్నాయి అనే సంగతి మీకు తెలుసా?అందుకే ఇప్పుడు మేనెలలో ఎన్ని సెలవులు, ఎందుకో అన్న విషయం తెలుసుకుందాం.రిజర్వ్‌ బ్యాంక్‌ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం చూసుకుంటే.

మే 1 – మేడే మే 5 – బుద్ద పూర్ణిమ మే 7- ఆదివారం మే 9- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జయంతి మే 13 – రెండో శనివారం మే 14- ఆదివారం మే 16 – రాష్ట్ర దినోత్సవం (సిక్కింలో మాత్రమే) మే 21- ఆదివారం మే 22- మహారాణా ప్రతాప్‌ జయంతి మే 24- కాజీ నజ్రుల్‌ ఇస్లాం జయంతి (త్రిపురాలో) మే 27- నాలుగో శనివారం మే 28- ఆదివారం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube