సాధారణంగా ఒక్కోసారి ముఖంపై నలుపు( Skin Darkness ) పేరుకుపోతూ ఉంటుంది.ఎండల ప్రభావం, డెడ్ స్కిన్ సెల్స్, కాలుష్యం ఇందుకు ప్రధాన కారణం.
అయితే ఆ నలుపు కారణంగా ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంటుంది.ఈ క్రమంలోనే ముఖ చర్మాన్ని మళ్లీ తెల్లగా కాంతివంతంగా మెరిపించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.
అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని కనుక పాటిస్తే చాలా సులభంగా ముఖ చర్మం పై పేరుకుపోయిన నలుపును వదిలించుకోవచ్చు.
అందుకోసం ముందుగా బాగా పండిన ఒక అరటి పండును( Banana ) తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసుకోవాలి.అలాగే అందులో నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చిపాలు,( Milk ) రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న అరటిపండు మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు మినప పిండి మరియు హాఫ్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై ఒక ఐస్ క్యూబ్ ను తీసుకుని చర్మానికి మంచిగా రబ్ చేసుకోవాలి.ఫైనల్ గా వాటర్ తో చర్మాన్ని క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.
ఈ సింపుల్ ఇంటి చిట్కాను పాటించడం వల్ల నలుపు మాయమవుతుంది.మృత కణాలు తొలగిపోతాయి.
చర్మం మృదువుగా, తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.

వారానికి రెండుసార్లు ఈ రెమెడీని కనుక పాలో అయ్యారంటే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే తగ్గు ముఖం పడతాయి.మొటిమల సమస్య దూరం అవుతుంది.
స్కిన్ కలర్ ఈవెన్ గా మారుతుంది.కాబట్టి అందమైన తెల్లటి మెరిసే చర్మాన్ని కోరుకునేవారు పైన చెప్పుకున్న రెమెడీని అస్సలు మిస్ అవ్వకండి.