అద్దె విషయంలో చోటు చేసుకున్న వివాదం కారణంగా 80 ఏళ్ల అమెరికాకు( America ) చెందిన ఎన్ఆర్ఐ( NRI ) మహిళను ఆమె ఇంట్లో అద్దెకు( House Rent ) ఉంటున్న కుటుంబానికి చెందిన బాలుడు సజీవ దహనం చేశాడు.పంజాబ్‌లోని లూథియానా( Ludhiana ) శివారు హోబోవాల్‌లో ఈ ఘటన జరిగింది.
స్థానిక జాసియన్ రోడ్‌లోని రఘుబీర్ పార్క్‌లోని ఓ ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది.తండ్రి నిరుద్యోగి కావడంతో ఈ కుటుంబం డబ్బు కోసం తీవ్రంగా పడుతోంది.
దీంతో గత 6 నెలల నుంచి అద్దె చెల్లించలేకపోయింది.అయితే అతని కుమారుడు అద్దె మొత్తంలో కొంత ఇవ్వడానికి వృద్ధురాలి వద్దకు వెళ్లాడు.
అయితే ఆమె పూర్తి మొత్తం డిమాండ్ చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.ఈ సమయంలో బాలుడు క్షణికావేశంలో ఆమెను ఎల్‌పీజీ స్టవ్‌పైకి తోసి నిప్పంటించాడు.
మృతురాలిని నరీందర్ కౌర్ డియోల్ (80)గా( Narinder Kaur Deol ) గుర్తించారు.ఈమె దాదాపు ఏడాది నుంచి లూథియానాలోనే నివసిస్తున్నారు.తన ఇంటి మొదటి అంతస్తులో నరీందర్ నివసిస్తుండగా.గ్రౌండ్ ఫ్లోర్‌లో అద్దెదారులు నివసిస్తున్నారు.17 ఏళ్ల నిందితుడైన బాలుడు 12వ తరగతి చదువుతున్నాడు.ఇతను కుటుంబాన్ని పోషించడానికి కూడా కష్టపడుతున్నారు.
హత్య విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల పాత్రపై ఆరా తీస్తున్నారు.

నరీందర్ కౌర్ కుమార్తె రవీందర్ కౌర్ మాట్లాడుతూ.అద్దెదారులు తన తల్లిని చంపారని చెప్పింది.నెలల తరబడి వారు అద్దె చెల్లించలేదని, ఘటనకు కొద్దిరోజుల ముందు కూడా అద్దె విషయంలో తన తల్లితో వాగ్వాదం జరిగిందని రవీందర్ తెలిపారు.
మార్చి 23న కాలిన గాయాలతో ఉన్న వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించి ఆమె కుమార్తె రవీందర్ కౌర్‌కు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నరీందర్ కౌర్ మార్చి 26న ప్రాణాలు కోల్పోయిందని వెల్లడించారు.

రవీందర్ కౌర్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు తొలుత బీఎన్ఎస్ సెక్షన్ 194తో దర్యాప్తు ప్రారంభించారు.ఎప్పుడైతే తన తల్లి మరణంలో అద్దెదారుల ప్రమేయం ఉందని రవీందర్ అనుమానం వ్యక్తం చేశారో అప్పటి నుంచి దర్యాప్తు మారింది.అద్దెదారుల కుమారులలో ఒకరైన మైనర్ బాలుడు కూడా కనిపించకపోవడంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.చుహార్‌పూర్ రోడ్డులోని సగం చౌక్ సమీపంలో అతనిని పట్టుకున్నారు.విచారణలో అతను తన నేరాన్ని అంగీకరించడంతో నిందితుడిపై హత్య కేసు నమోదు చేశారు.