ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటె బాబోయ్ ఆ ఈగో ఇష్యుస్ మాములుగా ఉండవు.అది కూడా ఇద్దరు టాప్ హీరోయిన్స్ ఉంటె ఇక అంతే సంగతులు.
అటు నిర్మాత, ఇటు దర్శకుడు చచ్చారే.ఇలా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పటికీ అనేక సమస్యలు వస్తున్నప్పటికి సినిమాలు వస్తూనే ఉన్నాయ్.
విడుదల అవుతూ హిట్టో, ఫట్టో తేలిపోతూనే ఉన్నాయ్.కానీ మనం ఇప్పుడు చెప్పుకునే సంఘటనలో ఒక సీనియర్, ఒక జూనియర్ హీరోయిన్ మధ్య వచ్చిన క్లాష్ వల్ల ఏకంగా సినిమానే ఆగిపోయింది అంటే నమ్ముతారా ? విషయం తెలిస్తే నమ్మకుండా ఉండలేరు.ఇంతకు ఆ సినిమా ఏంటో ? ఆ హీరోయిన్స్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ సంఘటనలో సీనియర్ హీరోయిన్ సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ అయినా జయ చిత్ర.
ఇక ఆ జూనియర్ హీరోయిన్ వచ్చేసి కవిత. ఈ ఇద్దరు హీరోయిన్స్ వారి వారి టైం లో స్టార్ హీరోయిన్స్ గా చక్రం తిప్పారు.
అయితే సీనియర్ అయినా జయ చిత్ర కు మొదటి నుంచి కాస్త ఆధిపత్య ధోరణి ఎక్కువ.కొత్తగా వచ్చిన కవిత తో ఆమెకు ఒక సినిమా షూటింగ్ టైం లో గొడవ అయ్యింది.
జయ చిత్ర కవితను తన ముందు ఎప్పుడైనా నిలబడి మాట్లాడాలంటూ చెప్పడం తో ఆమె కొత్తగా వచ్చింది కాబట్టి బయపడి అలాగే చేసింది.ఆలా ఒకటి రెండు సినిమాల్లో వీరి కాంబినేషన్ ఇలాగే సాగింది.
కవిత కూడా ఓర్పుగానే భరించింది.

అయితే కొన్నాళ్ళకు స్టార్ హీరోయిన్ గా ఎదిగాక ఒక సినిమాలో ఈ ఇద్దరిని బుక్ చేసారు.ఇంకా జయ చిత్ర షూటింగ్ లో కవితను ఏకవచనం తో పిలవడం తో పాటు కాస్త కించపరిచే విధంగా సంబోధించడం తో కవిత కు కోపం నషాళానికి ఎక్కింది.ఈ గొడవ చిలికి చిలికి గాలి వాన గా మారింది.
చివరికి తమిళ మూవీ యూనియన్ దగ్గరికి చేరింది.అప్పటి యూనియన్ పెద్ద అయినా విను ప్రసాద్ గారు జయ చిత్ర పై అసహనం వ్యక్తం చేసారు.
దాంతో జయ చిత్ర షూటింగ్ చివరి వరకు వచ్చిన సినిమాలో నటించాను అంటూ మొండికేసింది.ఈ సినిమా ఆలా ఆగిపోయింది.
ఆ తర్వాత సంవత్సరానికి నిర్మాత కాళ్ళ వేళ్ళ పడితే చాల కండిషన్స్ పెట్టి సినిమా పూర్తి చేసింది జయ చిత్ర.