ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తున్న పదం పాన్ ఇండియా.బాహుబలి సినిమా తర్వాత ఇక ఈ పదం టాలీవుడ్లో సర్వసాధారణంగా మారిపోయింది అని చెప్పాలి.
బాహుబలి సినిమా తెలుగుతో పాటు హిందీ సహా పలు భాషల్లో నిర్మించారు.నిర్మాతలు చెప్పలేదు కానీ ప్రేక్షకులే ఇది పాన్ ఇండియా సినిమా అంటూ డిసైడ్ చేసారు.
ఆ తర్వాత మొన్నటికి మొన్న విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించింది.సాదా సీదా సినిమాగా వచ్చిన కే జి ఎఫ్ సూపర్ హిట్ అవ్వడం తో ఇక రెండవ పార్ట్ ఫాం ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించి హిట్ కొట్టారు.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా టాలీవుడ్లోనే అంతంతమాత్రంగా క్రేజు ఉన్న హీరోలు సైతం ఇక ఇప్పుడు పాన్ ఇండియా మంత్రాన్ని జపిస్తూ వుండడం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.అక్కినేని హీరో అఖిల్ పట్టుమని నాలుగు సినిమాలు చేయలేదు.
చేసిన సినిమాల్లో అంతంత మాత్రంగా హిట్టయింది కూడా ఒకటే సినిమా.అయితే ఒక్క సినిమా హిట్ తో ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు అఖిల్.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ పాన్ ఇండియా సినిమా అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు.ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే అఖిల్ సినిమాను టాలీవుడ్ లోనే ఎక్కువగా పట్టించుకోరు.
ఇక ఇతర భాషల్లో ఎవరు పట్టించుకుంటారు అన్నది ప్రస్తుతం విశ్లేషకులు అనుకుంటున్న మాట.
కేవలం అఖిల్ ఒక్కడు మాత్రమే కాదండోయ్ మిగతా యువ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు అంటూ చెప్పుకోవడం ఇతర భాషల్లో కూడా విడుదల చేయడం చేస్తూ ఉన్నారు.పాన్ ఇండియా అంటే కథ ఒక రేంజ్ లో ఉండాలి.డైరెక్షన్ మరో రేంజ్ లో ఉండాలి.
కానీ అవన్నీ లేకుండానే సాధారణ సినిమాలకి పాన్ ఇండియా అనే పేరు పెట్టేసి విడుదల చేస్తూ ఉండటం హీరోలకే మైనస్ గా మారిపోతుంది అని చెప్పాలి.విజయ్ దేవరకొండ లైగర్, నిఖిల్ నటిస్తున్న కార్తికేయ2, సమంత యశోద, సందీప్ కిషన్ మైఖేల్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పాన్ ఇండియా సినిమాలే.
అయితే పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ లేని హీరోలకు ఇలా ఇతర భాషల్లో సినిమాను విడుదల చేయడం మాత్రం వృధా ఖర్చు అంటున్నారు సినీ విశ్లేషకులు.