భారత సంతతి సింగర్‌ ఇంటిపై కాల్పులు.. కెనడా పోలీసులకు చిక్కిన నిందితుడు

ఈ ఏడాది సెప్టెంబర్‌లో కెనడాలోని(Canada) వాంకోవర్‌ విక్టోరియా ద్వీపంలో ఫేమస్ పంజాబీ సింగర్, రాపర్ ఏపీ ధిల్లాన్ (Punjabi singer ,rapper AP Dhillon)ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.భారత్ – కెనడాలలో సంచలనం సృష్టించిన ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కెనడియన్ పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

 Indian National Held From Ontario For Firing Outside Singer Ap Dhillon's House I-TeluguStop.com

ఇతను భారత్‌కు చెందిన వ్యక్తేనని మీడియాలో కథనాలు వస్తున్నాయి.అలాగే సెప్టెంబర్ 2న ఈ ఘటన జరిగినప్పుడు ధిల్లాన్ ఇంటి వద్ద ఓ వ్యక్తి పలు రౌండ్లు కాల్పులు జరిపి, రెండు వాహనాలకు నిప్పు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసుల ప్రకటన ప్రకారం .ధిల్లాన్ ఇంటిపై కాల్పులకు సంబంధించి విన్నిపెగ్‌కు చెందిన అబ్జీత్ కింగ్రా (Abjeet Kingra)(25) అక్టోబర్ 30న అంటారియోలో అదుపులోకి తీసుకున్నారు.ధిల్లాన్ ఇంటిపై కాల్పులకు తమదే బాధ్యత అని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.కెనడియన్ మీడియా నివేదికల ప్రకారం.ఆ రోజున ధిల్లాన్ ఇంటి వెలుపల ఒక గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి సమయంలో కాల్పులు జరిపాడు.ధిల్లాన్ నిర్వహించిన ఓ కన్సర్ట్‌లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నాడని అదే బిష్ణోయ్ గ్యాంగ్ ఆగ్రహానికి కారణమని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.

Telugu Ap Dhillon, Canada, Punjabi, Rappershinda-Telugu Top Posts

కాల్పులు జరిగిన సమయంలో ధిల్లాన్ ఇంట్లో ఇండో కెనడియన్ రాపర్ షిండా కహ్లాన్‌ (Rapper Shinda Kahlan)ఉన్నాడు.కింగ్రా మొత్తం 14 రౌండ్ల కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.ఈ ఘటనలో ఒక నల్ల ట్రక్కు, చిన్న వాహనం కాలిపోయాయి.పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి ఆ ట్రక్ రిపేర్ చేయలేని విధంగా కాలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

కాల్పుల ఘటన తర్వాత ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ఆ వీధిని మూసివేశారు.

Telugu Ap Dhillon, Canada, Punjabi, Rappershinda-Telugu Top Posts

ఈ ఘటన వెనుక లారెన్స్ బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడైన గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ హస్తం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.బిష్ణోయ్ గ్యాంగ్‌లో గోల్డీ బ్రార్ కీలక సభ్యుడు.ఇక 80వ దశకం నాటి సింథ్ పాప్‌ని పంజాబీ సంగీతంలో మిక్స్ చేసి ఏపీ ధిల్లాన్ ప్రసిద్ధి చెందారు.

బ్రౌన్ ముండే, ఎక్స్‌క్యూస్‌, సమ్మర్ హై, మ్యాడ్ వంటి పాటలతో పాప్ ప్రపంచంలో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube