2025 సంవత్సరం సినీ అభిమానులకు ఒకింత ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ ను ఈ ఏడాది మరింత పెంచడం పక్కా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
అయితే 2025 సంవత్సరంలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేశ్ ( Chiranjeevi, Balayya, Nagarjuna, Venkatesh )సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.ఒకే ఏడాది నలుగురు హీరోల సినిమాలు రిలీజ్ కావడం అంటే అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి.
అయితే ముగ్గురు టాలీవుడ్ స్టార్స్( Three Tollywood stars ) మాత్రం ఈ ఏడాది ఫ్యాన్స్ కు షాకిచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు.ఈ స్టార్స్ జాబితాలో అల్లు అర్జున్, మహేష్ బాబు( Mahesh Babu ) ఉన్నారు.
మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూట్ ఈరోజే మొదలైందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.అయితే మహేష్ సినిమా ఈ ఏడాది, 2026లో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

మరో స్టార్ హీరో అల్లు అర్జున్ ( Allu Arjun )గత నెలలో పుష్ప2 సినిమాతో ముందుకొచ్చారు.ఈ ఏడాది బన్నీ సినిమాలేవీ విడుదల కావడం లేదు.బన్నీ ఫ్యాన్స్ కు కూడా ఈ ఏడాది భారీ షాక్ అనే సంగతి తెలిసిందే.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Young Tiger Jr.NTR )ఈ ఏడాది వార్2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నా ఈ సినిమాను హిందీ సినిమాగానే ఫ్యాన్స్ భావిస్తున్నారు.తారక్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమా కోసం 2026 వరకు ఆగాల్సిందే.

తారక్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తారక్ స్ట్రెయిట్ సినిమాలేవీ రిలీజ్ కాకపోవడం ఫ్యాన్స్ కు షాక్ అనే చెప్పాలి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.







