ఆ ప్రముఖ హీరోయిన్ ను స్టార్ డైరెక్టర్ చెంపదెబ్బలు కొట్టారా.. ఏం జరిగిందంటే?

మమిత బైజు.( Mamitha Baiju ) ప్రేమలు( Premalu ) అనే ఒకే ఒక సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయింది.

 Director Bala Denies Reports Hitting Mamitha Baiju Details, Director Bala, Mamit-TeluguStop.com

ఈ సినిమాతో భారీగా గుర్తింపు దక్కింది.ఈ ముద్దుగుమ్మకు మలయాళం తో పాటు తెలుగులో కూడా భారీగా అభిమానులు ఉన్నారు.

ఇక సోషల్ మీడియాలో అయితే మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు.ఇకపోతే ఈమెకు సంబంధించిన ఫోటోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

ప్రేమలు మూవీ తో భారీగా గుర్తింపును తెచ్చుకున్నప్పటికీ ఆ సినిమా తర్వాత ఆ స్థాయిలో మరే సినిమా అందుకోలేదు.

Telugu Balaslaps, Bala, Kollywood, Krithi Shetty, Mamitha Baiju, Premalu, Suriya

అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి.తమిళంలో కూడా హీరో సూర్య( Hero Suriya ) సరసన నటించే అవకాశం వచ్చి చేజారిపోయింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ నెట్టింట వైరల్‌ గా మారింది.

అదేమిటంటే దర్శకుడు మమితను లాగిపెట్టి కొట్టాడని, దీంతో ఆమె ఆ సినిమా నుంచే తప్పుకుందనే వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.కాగా తమిళ దర్శకుడు బాల( Director Bala ) వణంగాన్‌( Vanangaan ) అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో సూర్య హీరోగా, కృతిశెట్టి, మమిత హీరోయిన్లుగా నటించాల్సి ఉంది.కానీ కొంత షూటింగ్‌ పూర్తయిన తర్వాత సూర్య ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు.

Telugu Balaslaps, Bala, Kollywood, Krithi Shetty, Mamitha Baiju, Premalu, Suriya

ఆ తర్వాత కృతి, మమిత కూడా ఈ చిత్రం నుంచి వైదొలిగారు.అయితే సూర్య, కృతి శెట్టి ఎందుకు తప్పుకున్నారనే విషయం చెప్పకుండా సైలెంట్‌ గా వారి పనిలో బిజీ అయిపోయారు.మమిత మాత్రం దర్శకుడు బాల తనను కొట్టాడని, అందుకే ఈ చిత్రం నుంచి తప్పుకున్నానని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.దీంతో ఈ విషయం కోలీవుడ్‌ లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఆ తర్వాత మమిత మాట మార్చింది.మీడియా తన మాటలను వక్రీకరించిందని చెప్పింది.

అయితే తాజాగా ఈ విషయంపై దర్శకుడు బాల కూడా స్పందించారు.మమితను కొట్టానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.

షూటింగ్‌ సమయంలో ఓవర్‌ మేకప్‌ వేసుకొని వస్తే.ఎందుకు మేకప్‌ వేసుకున్నావ్‌? అంటూ కొట్టేలా చేయి పైకిఎత్తే వాడినని, అంతేకాని ఆమెపై చేయి చేసుకోలేదని చెప్పారు.మమితా తనకు బిడ్డలాంటిదని ఒక మహిళను నేను ఎందుకు కొడతాను అని బాల తెలిపారు.మరి ఈ వ్యాఖ్యలపై మమత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube