ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలలో చిన్న వయసులో నుంచి ముఖంపై నల్లనీ మచ్చలు ముడతలు ఎక్కువగా ఉంటాయి.ఈ మధ్యకాలంలో చాలామంది మొహం అందంగా కాంతివంతంగా కనిపించాలని అనుకుంటూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా ఆడవారు ముఖం అందంగా కాంతివంతంగా కనిపించడానికి ఎంత ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారు.అంతేకాకుండా ఇంటి చిట్కాలను పాటించి చాలా తక్కువ ఖర్చుతో సులభంగా మొహం మీద మడతలు నల్లని మచ్చలను తగ్గించుకోవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజల మొహం మీద మొటిమలు నల్లని మచ్చలు లేకుండా ముఖం కాంతివంతంగా మెరవాలంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.ఖరీదైన క్రీములను వాడాల్సిన అవసరం లేదు.
మనం మసాలా దినుసులుగా వాడే జాజికాయ చర్మం సౌందర్యంలో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.పురాతన కాలం నుంచి జాజికాయను చర్మ సంరక్షణ కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
దీనికోసం జాజికాయ పొడిని ఒక బౌల్లో అర స్పూన్ చందనం పోడి వేసి నీటితో పేస్ట్ గా తయారు చేసుకోవాలి.ఈ పేస్టు మొహానికి పట్టించి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే మొటిమలు నల్లని మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.

ఒక బౌల్ లో అర స్పూన్ తేనె వేసుకొని దానిలో పావు స్పూన్ జాజికాయ పొడి వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి పావు గంట తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖం మీద ఉన్న మృత కణాలు తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా మారిపోతుంది.ఈ విధంగా వారానికి రెండుసార్లు చేస్తే ఎంతో బాగా పనిచేస్తుంది.ఒక బౌల్లో ఒక స్పూన్ పాలు వేసి దానిలో పావు స్పూన్ జాజికాయ పొడి వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే ముడతలు తొలగిపోయి ముఖం యవ్వనంగా మృదువుగా కనిపిస్తుంది.కాబట్టి ఈ చిట్కాలను ట్రై చేసి అందమైన కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.