జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి.అస్సలు ఊహించని సమయంలో కొందరిని తిరిగి కలుస్తుంటాం.
అలాంటి ఓ అద్భుతమైన క్షణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్( Viral ) అవుతోంది.ఏడేళ్ల తర్వాత అనుకోకుండా కలుసుకున్న ఇద్దరు ప్రాణ స్నేహితుల( Two Best Friends ) ఎమోషనల్ రీ యూనియన్( Reunion ) వీడియో ఇప్పుడు నెటిజన్ల హృదయాలను ద్రవింపజేస్తోంది.
ఓ రోడ్డు పక్కన జరిగిన ఈ అరుదైన కలయిక వీడియో ఇప్పుడు లక్షలాది మందిని కదిలిస్తోంది.
ఆ వీడియోలో ఒక వ్యక్తి రోడ్డు పక్కన కూర్చున్న మరో వ్యక్తి దగ్గరకు వెళ్తాడు.
అతను హెల్మెట్ పెట్టుకుని ఉంటాడు.దగ్గరకు వెళ్లి “మీరు ఆర్మీలో ఉన్నారా? మీ పేరేంటి?” అంటూ హిందీలో అడుగుతాడు.ఆర్మీలో( Army ) ఉన్న ఆ వ్యక్తి కాస్త అయోమయంగా చూసి, “నేను ఆర్మీలోనే ఉన్నాను.ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు?” అని బదులిస్తాడు.
ఆ తర్వాత ప్రశ్నలు అడుగుతున్న వ్యక్తికి, ఎదురుగా ఉన్న ఆర్మీ ఆఫీసర్ తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడే( Childhood Friend ) అని ఒక్కసారిగా గుర్తొస్తాడు.కానీ, వెంటనే చెప్పకుండా సరదాగా ఓ చిన్న ప్రాంక్ చేయాలనుకుంటాడు.నవ్వుతూ, “నువ్వు చేసిన తప్పులకు దొరికిపోయావ్.నీ స్నేహితుడిని మోసం చేశావ్ కదా?” అంటూ ఆటపట్టిస్తాడు.కాస్త కోపంగా, గందరగోళంగా ఉన్న ఆర్మీ వ్యక్తి “గెటౌట్” అంటూ తన అసహనాన్ని చూపిస్తాడు.
అయితే, ఎక్కువసేపు ఆట ఆడించడు ఆ స్నేహితుడు.వెంటనే తనెవరో చెబుతాడు.అంతే, ఏడేళ్ల తర్వాత అనుకోకుండా కలుసుకున్న ఆ ఇద్దరు స్నేహితులు ఒక్కసారిగా షాక్ అయ్యి, తర్వాత ఎమోషనల్ అయ్యారు.
తమ కళ్ల ముందున్నది నిజంగానే తన స్నేహితుడా అని నమ్మలేకపోయారు.క్షణాల్లోనే ఆనందం, ఆశ్చర్యం, బాధ అన్నీ కలగలిపి వారి కళ్ల నుంచి కన్నీళ్లు జాలువారాయి.ఒకరినొకరు గట్టిగా హత్తుకుని బోరున ఏడ్చేశారు.ఆ క్షణం చూస్తున్న ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి.
ఈ హృద్యమైన, ఎమోషనల్ రీ యూనియన్ వీడియోను ‘indiawithoutpolitics’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటికే 27 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.“చాలా హృద్యంగా ఉంది”, “అద్భుతమైన సంఘటన”, “కన్నీళ్లు ఆగడం లేదు” అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఓ యూజర్ అయితే, “ఇది చూస్తే నాకు కూడా కన్నీళ్లు వచ్చాయ్” అని పోస్ట్ చేస్తే, మరో నెటిజన్ “బ్రో, నేను నీ ఫీలింగ్ అర్థం చేసుకోగలను” అని రాశాడు.
ఇలా ఏళ్ల తర్వాత ప్రియమైన స్నేహితులను కలవడం ఎంత ఆనందంగా ఉంటుందో ఈ వీడియో మరోసారి అందరికీ గుర్తు చేసింది.