వెయిట్ గెయిన్ అవ్వడం కోసం ఆరాటపడుతున్నారా? అయితే మీ డైట్ లో ఇది ఉండాల్సిందే!

బరువు తగ్గడం కోసమే కాదు బరువు పెరగడం కోసం ఆరాటపడే వారు కూడా ఎందరో ఉన్నారు.సాధారణంగా కొందరు చాలా సన్నగా చీపురు పుల్ల మాదిరి ఉంటారు.

 This Smoothie Helps To Gain Weight Healthy! Smoothie, Latest News, Health, Healt-TeluguStop.com

ఇలాంటి వారు బరువు పెరగడానికి నిత్యం చాలా కష్టపడతారు.కండరాలను పెంచుకోవడానికి, బరువు పెరగడానికి ఏవేవో డైట్లు ఫాలో అవుతారు.

అయినప్పటికీ బరువు పెరగరు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే స్మూతీ ఖ‌చ్చితంగా మీ డైట్ లో ఉండాల్సిందే.ఈ స్మూతీని తీసుకోవడం వల్ల హెల్దీగా మరియు వేగంగా బరువు పెరగవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ఏంటో.దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్ ను వేసుకోవాలి.అలాగే ప‌ది జీడిపప్పులు, వన్ టేబుల్ స్పూన్ పుచ్చ గింజలు, వన్ టేబుల్ స్పూన్ పొద్దు తిరుగుడు గింజలు, వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసుకోవాలి.

చివరిగా ఒక గ్లాస్‌ గోరువెచ్చని పాలు, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలిపి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత నానబెట్టుకున్న పదార్థాలు బ్లెండర్ లో వేసుకోవాలి.అలాగే రెండు తొక్క తొలగించిన‌ సపోటా పండ్లను వేసి ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన స్మూతీ సిద్ధమవుతుంది.ఈ స్మూతీని బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవాలి.

కనీసం నాలుగు సార్లు అయినా ఈ స్మూతీని తీసుకుంటే సన్నగా ఉన్నవారు చక్కగా బరువు పెరుగుతారు.

ఈ స్మూతీని డైట్ లో చేర్చుకోవ‌డం వల్ల శరీరానికి ఎన్నో పోషక విలువలు లభిస్తాయి.శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ అందుతుంది.దాంతో నీరసం అలసట వంటి సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

కాబట్టి సన్నగా ఉన్నామని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ స్మూతీని డైట్ లో చేర్చుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube