భారత్ – కివీస్ మధ్య జరగనున్న వన్డే మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది.హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు నిన్నటితో ఆన్ లైన్ టికెట్ల విక్రయాలు ముగిశాయి.
ఈ క్రమంలో 29 వేల టికెట్లను అమ్మినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకోగా రెండు టీం కెప్టెన్లు మీడియాతో మాట్లాడనున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ క్రికెట్ సందడి కొనసాగుతోంది.గత సెప్టెంబర్ లో భారత్ , ఆస్ట్రేలియా మధ్య టీ20 అభిమానులను ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే.
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్, భారత్ క్రికెటర్లు నగరానికి వచ్చారు.రేపు ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది.
మ్యాచ్ కు మరో రోజు మాత్రమే ఉండటంతో ఇరు జట్లూ బిజీబిజీగా గడపనున్నాయి.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేయనుంది.రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే.







