ప్రస్తుత రోజుల్లో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.నిద్రలేమి అనేది వినడానికి చాలా చిన్న సమస్య గా అనిపించవచ్చు.
కానీ నిద్రలేమి వల్ల వచ్చే అనర్థాలు, అనారోగ్య సమస్యలు అన్ని ఇన్ని కావు.ఎందుకంటే మనిషి ఆహారం లేకపోయినా కొన్ని రోజులు జీవించగలడు.
కానీ నిద్ర లేకపోతే శరీరంలో ఎనర్జీ మొత్తం ఇట్టే డౌన్ అయిపోతుంది.అందుకే కంటి నిండా నిద్ర ఎంతో అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
ఈ నేపథ్యంలోనే నిద్రలేమిని వదిలించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ రోజు నైట్ తయారు చేసుకుని తీసుకుంటే కనుక నిద్రలేమి దెబ్బకు పరారవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఈ డ్రింక్ ఏంటి అనేది ఓ చూపు చూసేయండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక గ్లాసు ఫ్యాట్ లెస్ మిల్క్ ను పోసుకోవాలి.

పాలు కాస్త హీట్ అవ్వగానే అందులో చిటికెడు పసుపు, పావు టేబుల్ స్పూన్ అశ్వగంధ పొడి, పావు టేబుల్ స్పూన్ ఆలివ్ సీడ్స్, చిటికెడు మిరియాల పొడి వేసి స్లో ఫ్లేమ్ పై పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన పాలను ఫిల్టర్ చేసుకోవాలి.ఇలా ఫిల్టర్ చేసుకున్న పాలల్లో వన్ టేబుల్ స్పూన్ ఖర్జూరం పేస్ట్ లేదా వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడిని కలిపి సేవించాలి.

నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ డ్రింక్ ను తీసుకోవాలి.ప్రతిరోజు నైట్ ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.ప్రశాంతమైన మరియు సుఖమైన నిద్ర మీ సొంతమవుతుంది.
ఇక కంటి నిండా నిద్ర ఉంటే దాదాపు తొంభై శాతం జబ్బులు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.కాబట్టి, ఎవరైతే నిద్రలేమి సమస్యతో సతమతం అవుతున్నారో తప్పకుండా వారు పైన చెప్పిన డ్రింక్ ను తమ డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.
నిద్రలేమి సమస్యకు బై బై చెప్పండి.