నువ్వులు( Sesame Seeds ) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.చూడడానికి చిన్న పరిమాణంలో కనిపించినా.
నువ్వుల్లో పోషకాలు మాత్రం లెక్కకు మిక్కిలిగా ఉంటాయి.రెగ్యులర్ డైట్ లో నువ్వులను చేర్చుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.
అనేక జబ్బులకు దూరంగా ఉంటారు.అయితే జుట్టు సంరక్షణకు సైతం నువ్వులు సహాయపడతాయి.
ముఖ్యంగా హెయిర్ గ్రోత్( Hair Growth ) లేదని బాధపడుతున్న వారు రెండు స్పూన్ల నువ్వులతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేశారంటే వద్దన్నా కూడా మీ జుట్టు బీభత్సంగా పెరుగుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం జుట్టుకు నువ్వులను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి ఒక చిన్న కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న నువ్వులు మరియు మెంతులు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloevera Gel ), వన్ టేబుల్ స్పూన్ బాదం నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్( Hair Pack ) ను వేసుకుంటే జుట్టుకు సరైన పోషణ అందుతుంది.హెయిర్ గ్రోత్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే కొద్దిరోజుల్లోనే ఒత్తుగా మారుతుంది.కురులు చక్కగా పెరుగుతాయి.అలాగే ఈ ప్యాక్ ను వేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.చుండ్రు సమస్య( Dandruff ) దూరం అవుతుంది.మరియు జుట్టు సిల్కీగా సైతం మారుతుంది.కాబట్టి హెయిర్ గ్రోత్ సరిగ్గా లేదని బాధపడుతున్న వారు నువ్వులను తప్పకుండా ఇప్పుడు చెప్పిన విధంగా ఉపయోగించండి.