మన హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడిని పూజించడం వల్ల కార్య సిద్ధి కలుగుతుందని ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారని చెపుతారు.అయితే రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతగా ఉందో మనందరికి తెలిసిందే.
ఇక పురాణాల ప్రకారం శని దేవుడు ప్రతి ఒక్కరి పై తన ప్రభావాన్ని చూపించారు.ఒక ఆంజనేయస్వామి, శివుడి పై తప్ప తన ప్రభావం అందరిపై ఉంటుంది.
అందుకే శని గ్రహ దోషం ఉన్నవారు ఆంజనేయ స్వామి లేదా శివుడిని పూజించడం వల్ల శని ప్రభావం దోషం తొలగిపోతుందని చెబుతారు.
ఇకపోతే శని ప్రభావం దోషమున్నవారు హనుమాన్ చాలీసా చదవడం ద్వారా వారికి శని ప్రభావం దోషం తొలగిపోతుందని చెప్పవచ్చు.
చాలీసా అంటే తెలుగులో నలభై అని అర్థం వస్తుంది.అలా హనుమాన్ చాలీసాలో నలభై శ్లోకాలు ఉంటాయి.
హనుమాన్ చాలీసా పఠనం వల్ల, హనుమంతుడిను మెప్పించి ఆయన దీవెనలు పొందవచ్చని అంటారు. అదే విధంగా శని ప్రభావ దోషం కూడా తొలగి పోతుందని చెబుతారు.

అయితే శని ప్రభావం దోషం తొలగిపోవాలంటే హనుమాన్ చాలీసా రోజుకు ఎన్ని సార్లు చదవాలి.ఎన్ని సార్లు చదవటం వల్ల శనిదోషం తొలగిపోతుందనే విషయానికి వస్తే.హనుమాన్ చాలీసా చదివే వారు ప్రతి శనివారం లేదా మంగళవారం మన పూజ గదిలో లేదా ఆంజనేయ స్వామి ఆలయంలో కూర్చొని భక్తి శ్రద్ధలతో మన మనసు మొత్తం ఆ హనుమాన్ చాలీసా పై పెట్టి 11 సార్లు చదవడం వల్ల ఆ ప్రభావం దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.ఇలా హనుమాన్ చాలీసా చదివే వారిపై అద్భుతమైన ప్రభావం ఉంటుందని చెప్పవచ్చు.