పొట్టి గారు గట్టివారు అంటారు.ఈ సామెత సరిగ్గా సరిపోతుంది అల్లు వారి కుటుంబానికి.
అల్లు రామలింగయ్య( Allu Ramalingaiah ) తోనే వారి కుటుంబంలో నటించడం మొదలైంది.ఆయన కమీడియన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే చాలా ఏళ్లపాటు కొనసాగారు.
మొదట హోమియోపతి డాక్టర్ అయినప్పటికీ నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో నాటక రంగంలోకి వచ్చి ఆ తర్వాత వెండితెరపై ఒక వెలుగు వెలిగారు.ఆయన లాగానే ఆయన వారసత్వం కూడా ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు.
అల్లు రామలింగయ్యకు ఉన్న సంతానంలో అల్లు అరవింద్( Allu Aravind ) మాత్రమే ఎంతో కొంత తెలివితేటలు కలిగిన వ్యక్తి.కానీ నటుడుగా అతడు రాణించలేకపోయాడు.
దాంతో నిర్మాతగానైనా అతనిని నిలబెట్టాలని ప్రయత్నించాడు అల్లు రామలింగయ్య.సరిగ్గా అల్లు అరవింద్ నటనకు పనికిరాడు అనుకున్న సమయంలో తన కూతురిని అయినా ఒక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు.అలా సురేఖకు( Surekha ) చిరంజీవిని ఇచ్చి వివాహం చేశాడు.ఏదో ఒక రోజు చిరంజీవి( Chiranjeevi ) ఇండస్ట్రీని ఏలుతాడు అని అల్లు రామలింగయ్య ఆరోజే గ్రహించాడు.
అలా తన కుటుంబంలోకి ఒక పెద్ద హీరోని అల్లుడిగా తెచ్చుకుని మొత్తానికి తన కుటుంబంలో సినిమా వారసత్వాన్ని ఆగిపోకుండా చేసుకున్నాడు అల్లు రామలింగయ్య.అప్పుడే ఇండస్ట్రీలో అడుగులు వేస్తున్న చిరంజీవికి అల్లు రామలింగయ్య కూడా బాగా ఉపయోగపడ్డాడు అలాగే చిరంజీవిని హీరోగా పెట్టి అల్లు అరవింద్ ఎన్నో సినిమాల తీసి ఎన్నో కోట్ల రూపాయలను కూడా పెట్టాడు.
అలా అల్లు రామలింగయ్య తర్వాత అల్లు అరవింద్ చిరంజీవితో బాగానే మింగిల్ అయ్యి సినిమాలను తీశారు.ఆ తర్వాత చిరంజీవి పని అయిపోతున్న సమయంలో తన కొడుకుని హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి చిరంజీవి సహాయం తీసుకుని బన్నీని( Bunny ) హీరోని చేశాడు అల్లు అరవింద్.ఇప్పుడు బన్నీ నేషనల్ స్టార్ అయిపోయాడు.అల్లు వారసత్వం కూడా నిలబడింది మొత్తానికి చూసుకుంటే అల్లు రామలింగయ్య తెలివిగా చేసిన ఒక పని అల్లు అరవింద్ కెరియర్ తో పాటు అల్లుసత్వానికి కూడా బాగా పనికి వచ్చింది.
అలా మొత్తానికి అల్లు అర్జున్( Allu Arjun ) లాంటి ఒక స్టార్ హీరో ఆ కుటుంబంలో ఉన్నాడు.చిరంజీవి హీరోగా లేకపోయి ఉంటే ఇవన్నీ సాధ్యమయ్యేది కాదు.