వేసవికాలం ( Summer ) రానే వచ్చింది.ఎండలు దంచికొడుతున్నాయి.
ఉదయం 10 దాటాక బయట కాలు పెట్టడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు.రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి.
అయితే వేసవికాలంలో ప్రధానంగా వేధించే సమస్యల్లో నీరసం ఒకటి.అధిక వేడి, శరీరంలో నీటి నిల్వలు పడిపోవడం తదితర కారణాల వల్ల నీరసం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది.
దాంతో ఏ పని చేయలేకపోతుంటారు.తీవ్ర అసౌకర్యానికి గురవుతారు.
అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ కనుక తీసుకుంటే క్షణాల్లో నీరసం నుంచి రిలీఫ్ పొందుతారు.నీరసాన్ని( Fatigue ) తరిమి కొట్టడానికి మరియు శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి ఈ డ్రింక్ ఉత్తమంగా సహాయపడుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం నీరసాన్ని దూరం చేసే ఆ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఐదు బాదం పప్పులు,( Badam ) ఐదు జీడిపప్పులు,( Cashew ) రెండు యాలకులు( Cardamom ) వేసుకుని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత అందులోనే ఒక కప్పు ఫ్రెష్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్లు బెల్లం పొడి మరియు నాలుగైదు ఐదు క్యూబ్స్ వేసి మరోసారి గ్రైండ్ చేసుకుంటే మన డ్రింక్ అనేది సిద్ధం అవుతుంది.ఈ డ్రింక్ తాగడానికి చాలా రుచికరంగా ఉంటుంది.
పైగా ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటుంది.
నీరసంగా ఉన్నప్పుడు ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే క్షణాల్లో రిలీఫ్ పొందుతారు.ఈ డ్రింక్ శరీరానికి తక్షణ శక్తిని( Instant Energy ) అందిస్తుంది.నీరసం అలసట వంటి సమస్యలను సమర్థవంతంగా తరిమి కొడుతుంది.
అలాగే ప్రస్తుత వేసవి కాలంలో ఈ డ్రింక్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.హిట్ స్ట్రోక్ గురి కాకుండా ఉంటారు.
రక్తపోటు అదుపులో ఉంటుంది.నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.
మరియు వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది.