సోషల్ మీడియా( Social media )… ప్రస్తుతం దీని హవా తప్ప మరొకటి ఏదీ లేదు.సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతే చాలు జీవితంలో ఇంకా సాధించడానికి గోల్స్ పెట్టుకోవాల్సిన పని లేదు అనేది ఇప్పటి యూత్ విధానం.
వారి జీవితాలు ఏమైపోతున్నాయో పట్టించుకోకుండా సెలబ్రిటీస్ ( Celebrities )అయిపోవడానికి ఉబలాటపడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో చిన్న చిన్న అవకాశాల కోసం వెంపర్లాడుతూ తమ జీవితాలు పక్కదోవ పడుతున్న కూడా పట్టించుకోవడం లేదు.
చేస్తున్నది తప్ప ఒప్పా తెలియకుండా ఒళ్ళు మరిచిపోయి నీచంగా బ్రతుకుతూ ఎవరిని ఉద్ధరిస్తారు వీళ్ళు.కన్న తల్లిదండ్రులతో కూడా సరిగా మాట్లాడరు కానీ ఇంస్టాగ్రామ్ లో సెలబ్రిటీస్ కోసం ఎగబడిపోతారు.
వారితో ఫోటోల కోసం చచ్చిపోతారు.చిన్న అవకాశం ఇస్తారేమో అని వారు ఏది చెబితే అది చేస్తారు.
ఇటీవల కాలంలో వరుసగా కొన్ని సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.నిన్నటికి నిన్న ఇంస్టా స్టార్ మరియు బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జష్వంత్ ( Shanmukh Jashwanth )గంజాయి తీసుకుంటూ పట్టు పడ్డాడు.అలాగే అతడి అన్న వినయ్ సంపత్( Vinay Sampath ) అవకాశాలు ఇప్పిస్తానని ఒక అమ్మాయిని మోసం చేశాడు.ఇది వారిపై నమోదైన కేసు.ఇందులో నిజానిజాలు పక్కన పెడితే 90% ఈ అలిగేషన్స్ లో నష్టపోయేది అమ్మాయిలే.ఇంతకన్నా ముందు పక్కింటి కుర్రాడు అనే యూట్యూబర్ వెబ్ సిరీస్ లతో ఫేమస్ అయిపోయిన చందు సాయి( Chandu Sai ) కూడా ఇదే తరహాలో ఒక షెడ్యూల్ క్యాస్ట్ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీరా కట్నం ఇస్తే చేసుకుంటానని లేదంటే నీ కులం అమ్మాయిని చేసుకోలేని మోసం చేయడంతో అతడు కూడా కటకటాల పాలు కావాల్సి వచ్చింది.
మరి కొన్ని రోజుల ముందు ఇలాగే ఒక అమ్మాయి యూట్యూబర్ భార్గవ్ ( YouTuber Bhargav )ని నమ్మి మోసపోవడం చూసాం.ఈ మధ్యకాలంలో ఇవి చాలా కామన్ అయిపోయాయి.అవకాశం ఇస్తారని యూట్యూబ్ లో ఫేమస్ అయిన వారి కోసం ఏది పడితే అది చేసి జీవితాలను నాశనం చేసుకోవడం వల్ల సాధించేది ఏమీ లేదు అని ఎప్పుడు గ్రహిస్తారో అర్థం కావడం లేదు ఈ పిచ్చి అమ్మాయిలు.ఇక చిన్న సైజు సెలెబ్రిటీస్ కాబట్టి తాము ఏది చేసినా నడుస్తుంది అని ఎలా పడితే అలా తిరిగి అమ్మాయిలను మోసం చేస్తాము అంటే ఊరుకునే రోజులు కూడా కావు.
మీ జీవితం ఎంత త్వరగా సెలబ్రిటీస్ గా వైరల్ అయిపోయారో తప్పు చేస్తే కూడా అంతే నీచంగా కిందకి పడిపోతారు.ఈ మాత్రం దానికి అమ్మాయిలను మోసం చేసి ఏమి సాధిస్తారు.? ఇకనైనా తప్పుగా ప్రవర్తించడం మానుకోండి తప్పులు చేయడం ఆపేయండి.అమ్మాయిలకు విలువ ఇవ్వండి అవకాశం ఇస్తామని నమ్మించి మోసం చేయకండి.
మీకు ఒక చెల్లి, తల్లి ఉన్నారు గుర్తుపెట్టుకోండి.