ఒకప్పుడు చాలా బాగుండేది.ఇండస్ట్రీలో చాలా మందికి అవకాశాలు వచ్చేవి.
కానీ ఇప్పుడు మాత్రం కాంపిటీషన్ బాగా ఎక్కువైపోయింది బాసూ.టాలెంట్ ఉన్నా అవకాశం వస్తుంది అని మాత్రం పక్కాగా చెప్పలేం.
అదృష్టం ఉంటే అవకాశం వస్తుంది లేదంటే లేదు అని అనుకుంటూ ఉంటారు ఎంతోమంది.కానీ ఎప్పుడు మాత్రమే కాదు ఒకప్పుడు టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో కూడా సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి చాలామంది చాలా కష్టాలు పడాల్సి వచ్చింది అన్నది కొంతమందికి మాత్రమే తెలుసు.
కొన్ని కొన్ని సార్లు సినిమా నటులు సైతం ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో చెబుతూ ఉంటారు.అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా సింగిరెడ్డి నారాయణరెడ్డి కి ఎంత ప్రత్యేకత ఉందో తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు.
సినారే గా ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ముద్దుగా పిలుచుకునేవారు.అయితే ఈయన సినిమా రంగంలోకి రాకముందు రచయితగా కాస్తోకూస్తో గుర్తింపు ఉండేది.అయినప్పటికీ అయినా సినిమా రంగంలో అడుగుపెట్టడానికి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేదట.ఇక అవకాశాలు రాకపోవడంతో చివరికి ఇంటికి తిరిగి వెళ్ళిపోవడానికి రైల్వే స్టేషన్కు చేరుకున్నారట.
అంతలోనే ఒక అద్భుతం.అదే ఆయన జీవితాన్ని మొత్తం మార్చేసింది.రైల్వే స్టేషన్ లో ఉన్న కొంతమంది వ్యక్తులు సినారే ని గుర్తించి శాలువా కప్పి ఇక రైల్వే స్టేషన్లోనే సన్మానం చేశారట.ఈ విషయం అప్పట్లో పేపర్లో కూడా వచ్చింది.
ఇక ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ స్వయంగా ఆయనను పిలిపించుకుని కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన గులేబకావళి అనే సినిమాలో ఒక పాట రాసేందుకు అవకాశం ఇచ్చారు.అయితే కొత్త వాళ్లకు అస్సలు అవకాశాలు లేవని కామేశ్వరరావు ఎన్టీఆర్ చెప్పడంతో సినారేకు అవకాశం ఇచ్చారు.
ఇక సినారె రాసిన మొదటి పాటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని ఈ పాట ఇప్పటికీ హిట్ లిస్టులో ఉంటుంది.ఆ తర్వాత సంగీత అనతి కాలంలోనే సినిరే మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నారు.
ఎప్పుడు అన్నగారికి రుణపడి ఉంటానని చెబుతూ ఉంటారట సినారే.