రావణుడు ఎప్పుడూ ఒంటరిగా ఎందుకు నిద్రపోయేవాడో తెలుసా?

రామాయణంలోని ప్రధాన పాత్రలలో ఒకటి కుంభకర్ణుడు అతను నిద్రపోతుగా ప్రసిద్ధి చెందిన రావణుని సోదరుడు.రామాయణంలోని వివరాల ప్రకారం అతను సంవత్సరంలో 6 నెలలు నిద్రపోయేలా బ్రహ్మ నుంచి శాపం పొందాడు.

 Why Ravan Slept Alone Know Interesting Facts  Ravana , Lord Rama, Ramayanam, Lor-TeluguStop.com

ఇదేవిధంగా అతి నిద్రకు సంబంధించి లంకాధిపతి రావణునికి సంబంధించిన ఒక ఉదంతం కూడా ఉందని మీకు తెలుసా? అవును.రామాయణ కథనం ప్రకారం అతి పెద్ద రాజ్యానికి రాజు రావణుడు.

విశ్వంలోని అన్ని సౌఖ్యాలను కలిగివున్నప్పటికీ రావణుడు ఒంటరిగా నిద్రపోయేవాడు.చాలామందికి ఇది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు.కానీ రామాయణం ప్రకారం ఇది నిజం.రావణుడు తన జీవితంలో ఎక్కువ భాగం ఒంటరిగా నిద్రపోయాడు.దీనికిగల కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.రామాయణ కాలంలో అంటే, త్రేతా యుగంలో పవన్‌పుత్ర హనుమంతుడు 100 యోజనాల సాగరాన్ని దాటి లంకకు చేరుకున్నప్పుడు, చాలా మంది రాక్షసులు అతనికి దారిలోకి ఎదురయ్యారు.

వారిని చంపి హనుమంతుడు లంకలోకి ప్రవేశించాడు.

లంక చేరుకున్న తరువాత అతను మొదట రావణుని గదిలోకి ప్రవేశించాడు.

అక్కడ రావణుడు ఒంటరిగా నిద్రిస్తున్నట్లు గమనించాడు.చుట్టుపక్కల ఎవరూ లేరు.

విశ్వంలోని అనేకమంది సుందరీమణులు మద్య తిరిగే రారాజు ఇలా ఒంటరిగా నిద్రపోతున్నందుకు హనుమంతుడు చాలా ఆశ్చర్యపోయాడు.ఇలా ఆలోచిస్తూ రావణుణిని మరింత పరిశీలనగా చూసినప్పుడు, రావణుడు గురక పెడుడూ నిద్రపోతున్నాడని గుర్తించాడు.

దీని ఆధారంగానే రావణుడు ఒంటరిగా నిద్రపోయేవాడని చెబుతారు.రావణునికి సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది.

దాని ప్రకారం రావణుడు శంకరుని పరమ భక్తుడు.అతను శివుని అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశాడు అయితే శివుని వాహనం నంది రావణుడిని శపించిందని మీకు తెలుసా? రామాయణంలోని వివరాల ప్రకారం రావణుడు ఒక కోతి చేతిలో అంతమవుతాడని నంది శపించిందట.అంతే కాదు నంది శాపం కారణంగా లంక దగ్ధమైందని చెబుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube