జుట్టు ఎంత విపరీతంగా రాలుతున్న సరే ఇలా చేస్తే దెబ్బకు ఆగుతుంది!

జుట్టు ( Hair ) విపరీతంగా రాలిపోతుందా.? ఎంత ఖరీదైన ఆయిల్ షాంపూ వాడిన సమస్య పరిష్కారం కావడం లేదా.? రకరకాల చిట్కాలు ప్రయత్నించి అలసిపోయారా.? అయితే ఇక‌పై అసలు చింతించకండి.జుట్టు ఎంత విపరీతంగా రాలుతున్న సరే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే దెబ్బకు ఊడటం ఆగిపోతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం హెయిర్ ఫాల్( Hair Fall ) సమస్యను అదుపులోకి తెచ్చే ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

 Effective Home Remedy For Stop Hair Fall Details! Hair Pack, Hair Fall, Stop Hai-TeluguStop.com

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు మెంతులు ( Fenugreek ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్‌ తీసుకుని అందులో నానబెట్టుకున్న మెంతులు వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మెంతుల మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు మందారం పువ్వుల పొడి, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Curd, Fenugreek Seeds, Care, Care Tips, Fall, Pack, Remedy, Long, Thick-T

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే కనుక జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.

కుదుళ్ళు బలోపేతం అవుతాయి.దాంతో హెయిర్ ఫాల్ సమస్య అదుపులోకి వస్తుంది.

Telugu Curd, Fenugreek Seeds, Care, Care Tips, Fall, Pack, Remedy, Long, Thick-T

కాబట్టి ఎవరైతే అధిక‌ హెయిర్ ఫాల్ సమస్యతో మ‌ద‌న ప‌డుతున్నారో తప్పకుండా వారు ఈ రెమెడీని పాటించండి.హెయిర్ ఫాల్ కు బై బై చెప్పండి.పైగా ఈ రెమెడీని పాటిస్తే జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది.మరియు కురులు స్మూత్ అండ్ షైనీ గా సైతం మెరుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube