ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ పని అయిపొయింది అనే మాట వినే అవకాశం దక్కడం లేదు.ఒకప్పుడు సావిత్రి కాలంలో హీరోయిన్ 20 ఏళ్ళైనా నటిస్తూ ఉండేవారు.
కానీ ఆ తర్వాత కాలంలో ఒక పదేళ్లు లేదా ఐదేళ్లకు ఫిక్స్ అయిపోయారు.కానీ మళ్లి ఓటిటి( OTT ) వచ్చాక హీరోయిన్స్ లైఫ్ స్పాన్ పెరిగిపోయింది.
హీరోయిన్ గా సినిమాల్లో వయసు అయిపోయిన, ప్లాప్ లు వచ్చిన వారి కెరీర్ మాత్రం ముగియడానికి అవకాశం లేకుండా మంచి నటన ఉంటె చాలు ఎలాగైనా గట్టెక్కాచు అని బోలెడన్ని వెబ్ సిరీస్ లు నిరూపిస్తున్నాయి.ఈ మధ్య కాలంలో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్ అందరు ఇలా ఓటిటి బాట పట్టారు.మరి వారు ఎవరో ఒకసారి చూద్దాం.
హన్సిక

ఈ అమ్మడు పెళ్ళైన కూడా ప్రస్తుతం బిజీ గానే ఉంది.అప్పుడెప్పుడో అల్లు అర్జున్ తో దేశ ముదురు సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇంకా ఆమె కెరీర్ అయిపొయింది అనుకున్నవారికి షాక్ ఇస్తూ తాజాగా మైత్రి( MY3 ) అనే ఒక ఓటిటి వెబ్ సిరీస్ చేసి తన పని అయిపోలేదు అంటుంది.ఇప్పుడు నషా అనే మరో సిరీస్ తో రాబోతుంది.
కాజల్

పెళ్ళై ఒక కొడుకు పుట్టిన కూడా అబ్బో కాజల్( Kajal ) క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.వస్తే సినిమాలు లేదు అంటే ఓటిటి అంటూ ఎల్లప్పుడూ బిజీ గానే ఉంటుంది.ప్రస్తుతగం 4 సినిమాల్లో నటిస్తూ కొన్ని రోజుల క్రితం లైవ్ టెలికాస్ట్ అనే ఒక వెబ్ సిరీస్ కూడా చేసింది.
అంజలి

హీరోయిన్ అంజలి( Anjali ) గురించి చెప్పక్కర్లేదు.ఈమె తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాల్లో కూడా బాగా పాపులర్ అయ్యి ఇప్పుడు మూడు సినిమాలతో బిజీ గా ఉన్న కూడా వెబ్ సిరీస్ లు కూడా వరసగా చేస్తుంది.ఇప్పటికే ఫాల్, ఝాన్సీ, నవరస అనే సిరీస్ లు చేయగా ఇప్పుడు బహిష్కరణ అనే మరొక సిరీస్ చేస్తుంది.
తమన్నా

తమన్నా( Tamanna ) సినిమాలు తగ్గిన కూడా వెబ్ సిరీస్ లు మాత్రం ఇరగదీస్తోంది.2021 నుంచి ఇప్పటికే 5 సిరీస్ లు చేసి తన హావ కొనసాగిస్తోంది.
నిత్య మీనన్

బరువైన అందాల సుందరి నిత్య( Nithya Menon ) మొన్నీ మధ్యనే కుమారి శ్రీమతి, మాస్టర్ పీస్ వంటి సిరీస్ లతో ఫుల్ బిజీ అయిపోయింది.వీటి కన్నా ముందు మరో 2 ఓటిటి ప్రాజెక్ట్స్ చేసింది నిత్య.
ఈషా రెబ్బ

ఈమె తెలుగు లో ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపొయింది.కానీ త్రీ రోజెస్, పిట్ట కథలు, మాయ బజార్ ఫర్ సేల్, దయ వంటి సిరీస్ లతో ఓటిటి క్వీన్ గా వెలుగొందుతుంది.ఇది కాకుండా సుధీర్ బాబు మామ మచ్చింద్ర లో కూడా నటించింది.